AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Shroff: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. కాబోయే భార్య వివరాలు గోప్యంగా ఉంచిమరీ..

నటుడు సచిన్ ష్రాఫ్ (50) రెండో వివాహం చేసుకున్నాడు. సచిన్‌ ష్రాప్‌ - చాందిని కోఠిల వివాహాన్ని సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించాడు. ముంబాయ్‌లో అత్యంత సన్నిహితుల మధ్య..

Sachin Shroff: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. కాబోయే భార్య వివరాలు గోప్యంగా ఉంచిమరీ..
Sachin Shroff
Srilakshmi C
|

Updated on: Feb 26, 2023 | 5:37 PM

Share

నటుడు సచిన్ ష్రాఫ్ (50) రెండో వివాహం చేసుకున్నాడు. సచిన్‌ ష్రాప్‌ – చాందిని కోఠిల వివాహాన్ని సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించాడు. ముంబాయ్‌లో అత్యంత సన్నిహితుల మధ్య శనివారం (ఫిబ్రవరి 25) వీరి వివాహం జరిగింది. వీరి రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి ముందు సచిన్ ష్రాఫ్ తనకుకాబోయే భార్య వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాడు. ఆమె ఎవరో, కనీసం పేరైనా వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం సచిన్‌ సోదరి స్నేహితురాలని తెలుస్తోంది. గుట్టుచప్పుడుకాకుండా రెండో పెళ్లి చేసుకున్న సచిన్‌ రిసెప్షన్‌ ఫంక్షన్‌లో తన భార్య చాందినిని మీడియా ముందు పరిచయం చేశాడు. ఈవెంట్ ఆర్గనైజర్, ఇంటీరియర్ డిజైనర్‌ అయిన చాందిని వివరాలు అత్యంత గోప్యంగా ఉంచడంపై సర్వత్రా పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా సచిన్‌ 2009 ఫిబ్రవరిలో సహనటి అయిన జుహీ పర్మార్‌ను మొదటి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల రిత్య వీరు 2018లో విడాకులు తీసుకున్నారు. వీరికి 2013లో సమైరా ష్రాప్‌ అనే కుమార్తెకు జన్మనిచ్చారు. విడాకుల తర్వాత ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు. ప్రస్తుతం అతను తారక్ మెహతా కా ఊల్తా చష్మాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..