AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైనర్ బాలికను కిడ్నాప్‌ చేసి బలవంతంగా వివాహం చేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు.. పోలీసుల ఎంట్రీతో సీన్‌రివర్స్‌..

ఓ మైనర్ బాలికను కిడ్నాప్‌ చేసి అరవై ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్నాడు. ఆ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

మైనర్ బాలికను కిడ్నాప్‌ చేసి బలవంతంగా వివాహం చేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు.. పోలీసుల ఎంట్రీతో సీన్‌రివర్స్‌..
Pakistan News
Srilakshmi C
|

Updated on: Feb 25, 2023 | 8:57 PM

Share

పాకిస్తాన్‌ మతాచారాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యకేంగా చెప్పనక్కరలేదు. దురాచారాల ముసుగులో అక్కడ మహిళలపై నిత్యం అఘాయిత్యాలు చోటుచేసుకుంటుంటాయి. ఇక ఆ దేశంలోని మైనార్టీల బతుకు దినదిన గడంగా ఉంటుంది. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం, ముఖ్యంగా ఆడపిల్లలకు మత మార్పిడి చేసి వివాహం చేసుకోవడం వంటి దురాగతాలకు లెక్కేలేదు. తాజాగా ఓ మైనర్ బాలికను కిడ్నాప్‌ చేసి అరవై ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్నాడు. ఆ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

బాధిత మైనర్‌ బాలిక సితార ఆరిఫ్ (15) తండ్రి ఆరిఫ్ గిల్. ఐతే అరిఫ్‌ గిల్‌ అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కుటుంబ పోషణ నిమిత్తం కుమార్తెను పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని ఫైసలాబాద్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం ప్రిన్సిపాల్ నైలా అంబ్రిన్ (60) ఇంట్లో పనికి కుదిర్చాడు. బాలికపై ఎన్నేసిన నైలా అంబ్రిన్ తనను వివాహం చేసుకోవల్సిందిగా బాలికను రెండు నెలలుగా బలవంతం చేయసాగాడు. ఈ క్రమంలో రోజూ పనిముగించుకుని ఇంటికి తిరిగివచ్చే సితారా డిసెంబర్ 15న మాత్రం రాలేదు. కొన్నాళ్ల తర్వాత సితార ఇస్లాం మతంలోకి మారిందని, ఆమెకు వివాహం జరిగిందనే వార్త కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో సితార కుంటుంబ సభ్యులు నైలా అంబ్రిన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో ఈ నెలలో పాకిస్తాన్ మైనారిటీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అక్మల్ భట్టిని సితారా తండ్రి కలిసి తమ గోడును వెల్లడించాడు. అక్మల్ భట్టి జోక్యంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నైలా అంబ్రిన్ నివాసంలో సోదాలు నిర్వహించగా.. సితారకు 18 ఏళ్లు నిండాయని, ఆమె అనుమతితో రెండో వివాహం చేసుకున్నట్లు ఇస్లామిక్ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని నైలా అంబ్రిన్ పోలీసులకు చూపాడు.

సాధారణంగా ఇటువంటి కేసుల్లో బాలికపై ఆత్యాచారానికి పాల్పడి, ఆనంతరం సానుభూతితో ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు పాక్‌ ముస్లిం పురుషులు అందరినీ నమ్మిస్తారు. సితార విషయంలో కూడా నైలా అంబ్రిన్ ఇలాంటి ప్లానే వేశాడు. మైనర్ క్యాథలిక్ అయిన సితారను కిడ్నాప్ చేసి, బలవంతంగా వివాహం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఐతే పాకిస్థాన్‌లో మైనర్‌ను పెళ్లి చేసుకోవడం చట్టరిత్య నేరం కావడంతో ఈ వ్యవహారంపై కేసు నడుస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.