AP Education System: ఏపీ విద్యావిధానంపై స్విట్జర్లాండ్‌ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు.. ఇంతకీ ఏమన్నారంటే..

ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. ప్రత్యేకించి విద్యా వ్యవస్థపై స్విట్జర్లాండ్‌ మాజీ ఆధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిన్‌ ప్రశంసలు కురిపించారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో..

AP Education System: ఏపీ విద్యావిధానంపై స్విట్జర్లాండ్‌ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు.. ఇంతకీ ఏమన్నారంటే..
AP Education System
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2023 | 5:03 PM

ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. ప్రత్యేకించి విద్యా వ్యవస్థపై స్విట్జర్లాండ్‌ మాజీ ఆధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిన్‌ ప్రశంసలు కురిపించారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుక్కొంటోంది. ఐతే ఇండియాలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్ధుల కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. నాడు-నేడు ప్రొగ్రాం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయి. విద్యార్ధులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తోంది. ఇది గర్వించతగ్గ విషయం. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్ధులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరివల్ల కాదు. విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రత్యేక దృషి ఉన్నవారికే సాధ్యమవుతుందని’ ఆయన ఏపీ విద్యావిధానంపై ప్రశంసలు కురిపించారు.

ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాల స్టాల్‌ను..పలువురు ప్రముఖులు సందర్శించారు. స్వయంగా దేశ అధ్యక్షుడే ఏపీ విద్యావిధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జవరల్‌ పాట్రిసియా దన్జీ స్టాల్‌ను సందర్శించారు. డిజిటల్‌ లెర్నింగ్‌, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్ధులకు ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల ఆధునీకరణ, డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు వంటి ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన.. పేద విద్యార్ధులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారని కొనియాడారు. ఏపీ విద్యావిద్యావ్యవస్థలో భాగంగా  నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాల మెరుగుదల.. తదితర విషయాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే