Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Italy: ఎప్పుడూ నీళ్లలో తేలియాడే వెనీస్ అందాలు ఎండిపోతున్నాయ్‌.. ఎందుకీ దుస్థితి..?

నీటిపై తేలియాడే వెనీస్‌ నగరం ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. నీరు అడుగంటి పోయి సుందరమైన వెనీస్‌ నగరం అందవిహీణంగా తయారైంది. ఇప్పటికే ఇటలీలో కరువు చాయలు..

Italy: ఎప్పుడూ నీళ్లలో తేలియాడే వెనీస్ అందాలు ఎండిపోతున్నాయ్‌.. ఎందుకీ దుస్థితి..?
Venice Becomes Dry
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 23, 2023 | 5:15 PM

నీటిపై తేలియాడే వెనీస్‌ నగరం ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. నీరు అడుగంటి పోయి సుందరమైన వెనీస్‌ నగరం అందవిహీణంగా తయారైంది. ఇప్పటికే ఇటలీలో కరువు చాయలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం గత ఏడాది యూరప్‌లో ఎండలు ఠారేత్తించడమే కారణం. ఈ ఏడాది కూడా అదే సీన్‌ రిపీట్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే వెనీస్‌ ప్రస్తుతం ఎండిపోయి కళావిహీనంగా మారిపోయాయి.

వెనిస్‌ కాలువలు ఎండిపోవడానికి ప్రధాన కారణం అక్కడ వర్షపాతం ఘణనీయంగా తగ్గిపోవడమే. హై ప్రెషర్‌ సిస్టమ్‌తో పాటు పుల్‌ మూన్‌, సీ కరెంటు సముద్ర తరంగాలు కారణమని దీంతో ఇటలీలోని నదులు కాలువలు ఎండిపోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఇక్కడ తరచూ వరదలు వస్తుంటాయి. వెనిస్‌ కాలువల్లో నీటిశాతం తగ్గి దాదాపు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతోపాటు ఇటలీకి చెందిన అతి పొడవైన నదులకు మంచుకొండల నుంచి కరిగి వచ్చే నీరు ఈ సారి 61 శాతం తగ్గిందని చెబుతున్నారు. దీంతో దేశంలో కరువుకాటకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇటలీలోని ‘పొ’ నది ఎండిపోవడంతో ఇటలీ గత 70 ఏళ్లలో ఎన్నడూలేని కరువు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఏకధాటిగా 50 రోజుల పాటు భారీ వర్షాలుకురిస్తే తప్ప ఈ కరువు నుంచి వెనీస్‌ బయటపడదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇటలీ ఈశాన్య తీరంలో నీళ్లపై తేలియాడుతున్నట్లుండే ఈ నగరం వందకు పైగా దీవుల సముదాయం. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం అత్యంత కనిష్టానికి పడిపోవడంతో చుట్టు పక్కల ఉన్న చిన్నచిన్న ద్వీపాలకు తేలిగ్గా చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు వచ్చే 15 రోజుల పాటు పశ్చిమ యూరోప్‌లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే నీళ్లలోని వెనీస్‌ నేలకు దిగిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.