Telangana Staff Nurse: తెలంగాణ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు 40,100ల దరఖాస్తులు.. రాత పరీక్ష ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు మంగళవారం (ఫిబ్రవరి 21)తో ముగిశాయి. మొత్తం 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు దాదాపు 40,100ల మంది దరఖాస్తు..

Telangana Staff Nurse: తెలంగాణ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు 40,100ల దరఖాస్తులు.. రాత పరీక్ష ఎప్పుడంటే..
Telangana Staff Nurse
Follow us

|

Updated on: Feb 22, 2023 | 8:35 PM

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు మంగళవారం (ఫిబ్రవరి 21)తో ముగిశాయి. మొత్తం 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు దాదాపు 40,100ల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష ద్వారా తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) వీరిని ఎంపిక చేయనుంది. రాత పరీక్షలో సాధించిన మార్కులతోపాటు, వెయిటేజీ మార్కులను కూడా కలపనున్నారు. రెండింటినీ కలిపి తుది మెరిట్‌లిస్టును ప్రకటిస్తారు. వెయిటేజీ ఎలా నిర్నయిస్తారంటే..

ఇప్పటికే ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్నవారికి, గతంలో పనిచేసినా వారికి వెయిటేజీ మార్కులు కేటాయించనున్నారు. రాత పరీక్షను 80 పాయింట్లకు. మిగిలిన 20 పాయింట్లకు వెయిటేజీ ఆధారంగా కేటాయిస్తారు. ఈ విధంగా మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. వెయిటేజీ ప్రాంతాన్ని బట్టి కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన, చేస్తున్నవారికి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. ఇతర ప్రాంతాల్లో సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. అంటే ఇతర ప్రాంతాల్లో 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.