- Telugu News Photo Gallery Cinema photos Anchor Suma children latest photos goes viral on social media
Anchor Suma: బుల్లితెర స్టార్ యాంకరమ్మ సుమ పిల్లలు ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..?
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ పరిచయం అక్కరలేని పేరు. బుల్లితెరపై రారాణిగా తన యాంకరింగ్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్న సుమ ఎన్ని వేల షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారో లెక్కేలేదు..
Updated on: Feb 22, 2023 | 6:57 PM

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ పరిచయం అక్కరలేని పేరు. బుల్లితెరపై రారాణిగా తన యాంకరింగ్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్న సుమ ఎన్ని వేల షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారో లెక్కేలేదు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లు, టాక్ షోలు.. ఇలా వరుస షూటింగ్‌లతో సుమ ఎంత బిజీగా ఉన్నా గృహిణిగా, తల్లిగా తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తుంటారు.

బుల్లితెరకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరిసి అలరిస్తున్నారు. వర్క్‌లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఇప్పటికీ వరుస ప్రోగ్రాములతో బుల్లితెరపై దూసుకుపోతున్నారు.

సుమ, రాజీవ్ కనకాలకు ఇద్దరు పిల్లలున్నారనే విషయం అందరికీ తెలుసు. కొడుకు రోషన్ కార్తిక్ కనకాల, కూతురు స్నేహనస్విని కనకాల.. ప్రస్తుతం వీరు ఎలా ఉన్నారో తెలుసా..? వీరి లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సుమ నటిగా, వ్యాఖ్యతగా మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు.




