Rakul Preet Singh: ఏంటీ.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు పెళ్లైపోయిందా..? ‘అవును.. గతేడాదే నా పెళ్లి జరిగింది’.. నటి క్లారిటీ ఇదే

గత ఏడాది నవంబర్‌లో తమ పెళ్లి జరిగిపోయిందని.. ఐతే అది ఎలా జరిగిందో తమకు తెలియదని టాలీవుడ్‌ హారోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై..

Rakul Preet Singh: ఏంటీ.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు పెళ్లైపోయిందా..? 'అవును.. గతేడాదే నా పెళ్లి జరిగింది'.. నటి క్లారిటీ ఇదే
Rakul Preet Singh Marriage Rumours
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 22, 2023 | 8:09 PM

గత ఏడాది నవంబర్‌లో తమ పెళ్లి జరిగిపోయిందని.. ఐతే అది ఎలా జరిగిందో తమకు తెలియదని టాలీవుడ్‌ హారోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై నటి స్పందించారు. రకుల్‌, ప్రముఖ ప్రొడ్యూసర్‌ జాకీ భగ్నానితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిదే. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అప్పుడప్పుడూ మీడియాకు చిక్కుతున్నారు కూడా. ఈ క్రమంలో రకుల్‌ ప్రియుడితో పెళ్లికి రెడీ అయిందని, ఈ విషయాన్ని రకుల్‌ సోదరుడు అమన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్వయంగా వెళ్లడించాడంటూ పలు పుకార్లు గత కొంతకాలంగా జోరందుకున్నాయి. నవంబర్‌లో రకుల్ పెళ్లి చేసుకోనుందని గత ఏడాది అక్టోబర్‌లో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

అది గూగుల్ అలర్ట్‌లో వస్తుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా వెతకవలసిన అవసరం లేదు. ప్రతి వారం నా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ వార్తల ప్రకారం గతేడాది నవంబర్‌లోనే నేను పెళ్లి చేసుకన్నాను. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. ప్రస్తుతం నా ధ్యాసంగా నటించడంపైనే ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇంకా రకుల్‌ ఈ విధంగా మాట్లాడింది.. సాధారణంగా గూగుల్లో నేను ఆహారం, ఏ ఆహారంలో ఎన్ని క్యాలరీస్‌ ఉంటాయనే విషయాలు సర్చ్‌ చేస్తుంటాను. ఎక్కువగా ఫుడ్‌, కేలరీలు, ఆరోగ్యం గురించిన విషయాలు గూగుల్‌లో చదువుతాననని చెప్పింది. నటన తప్ప వేరే ఇష్టాలేమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాదానం చెబుతూ.. వంటలు చెత్తగా ఎలా వండాలనేది ఎవరికైనా నును నెర్పించలగనని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలకు వస్తే.. భారతీయుడు 2 కమల్ హాసన్‌తో రకుల్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.