Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అందంగా ఉన్నానని నాపై దాడి చేశారు..’ పోలీసులకు సవాల్‌ విసురుతోన్న వింత కేసు

ఆడవారు సుకుమారులే కాదు సొగసరులు కూడా. ఐతే అందం విషయంలో మాత్రం ఆడవాళ్లు ఏ మాత్రం రాజీ పడరు. తమ కంటే ఇతరులెవరైనా కాస్త సౌందర్యవంతులైతే అసూయ పడిపోతుంటారు. ఎంతకాదన్నా ఇది మగువల సహజ లక్షణమనేది..

'అందంగా ఉన్నానని నాపై దాడి చేశారు..' పోలీసులకు సవాల్‌ విసురుతోన్న వింత కేసు
Haryana News
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 23, 2023 | 8:12 PM

ఆడవారు సుకుమారులే కాదు సొగసరులు కూడా. ఐతే అందం విషయంలో మాత్రం ఆడవాళ్లు ఏ మాత్రం రాజీ పడరు. తమ కంటే ఇతరులెవరైనా కాస్త సౌందర్యవంతులైతే అసూయ పడిపోతుంటారు. ఎంతకాదన్నా ఇది మగువల సహజ లక్షణమనేది జగమెరిగిన సత్యం. ఐతే తాజాగా హర్యాణాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అందంగా ఉన్న తనపై ఓర్వలేక మహిళలు దాడి చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దాడికి పాల్పడ్డ మహిళలు నేరం అంగీకరించడం కొసమెరుపు. వివరాల్లోకెళ్తే..

హర్యానాలోని సోనేపట్ పరిధిలోని కుండ్లీ అపార్ట్‌మెంట్‌లో గౌరవ్ దహియా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం అతడి కోసం ఓ యువతి వచ్చింది. ఆ సమయంలో దహియా ఇంట్లో లేకపోవడంతో అతను వచ్చే వరకు యువతి ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో పక్క ఫ్లాట్లలోని మహిళలు యువతి వద్దకు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ ఆగ్రహంతో యువతిపై సామూహికంగా దాడి చేశారు. అనతరం ఆమె వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, మొబైల్ ఫోన్ తదితరాలను కూడా లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకని బయటపడ్డ సదరు యువతి పోలీస్ హెల్ప్‪‪‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసింది. అందంగా ఉన్నానని ఓర్వలేక నాపై కొందరు మహిళలు దాడి చేశారంటూ ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు. అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించారు. దాడి చేసిన మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అధికారికంగా వివరాలు ఇలా ఉన్నా స్థానికులు తెలిపిన వివరాలు మరోలా ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కేవలం అందం కారణంగా దాడి జరిగిందంటే పోలీసులకు నమ్మశక్యంగా లేదు. దీని వెనుక అసలు కారణం ఏమైఉంటుందోనని జుట్టు పీక్కుంటున్నారు. కాగా ఈ విచిత్ర ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.