Viral: కడుపు ఉబ్బరం, నొప్పితో ఆసుపత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లకు మైండ్ బ్లాంక్!

గత కొన్నేళ్లుగా ఓ మహిళ కడుపు ఉబ్బరం, తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా..

Viral: కడుపు ఉబ్బరం, నొప్పితో ఆసుపత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లకు మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us

|

Updated on: Feb 23, 2023 | 4:26 PM

గత కొన్నేళ్లుగా ఓ మహిళ కడుపు ఉబ్బరం, తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. నొప్పి తగ్గకపోగా.. మరింత పెరగడంతో.. ఆరోగ్యం కూడా క్షీణిస్తుండటంతో ఆమె చివరికి ఓ పెద్దాసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు పలు రకాల పరీక్షలు చేసి.. ఆమెకు స్కానింగ్ తీయడంతో అసలు విషయం బయటపడింది. స్కాన్‌లో కనిపించింది చూసి.. వారికి మైండ్ బ్లాంక్ అయింది. ఆమె కడుపులో ఏకంగా 4 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సరోజ్ అనే మహిళ గత కొన్నేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతోంది. అది తగ్గేందుకు ఎన్నో మందులు, ఆసుపత్రులు తిరిగింది. ఏమాత్రం ఉపయోగం లేకపోవడంతో.. చివరికి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఉన్న ఓం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడున్న డాక్టర్లు సదరు మహిళకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ కూడా చేశారు. ఇక వచ్చిన రిపోర్ట్స్‌ను చెక్ చేయగా.. ఆమె కడుపులో 4 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంటన్నరకు పైగా శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు వైద్యులు. కాగా, ఆపరేషన్ అనంతరం సదరు మహిళ ఆరోగ్యం కుదుటపడిందని.. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ ఆమెను డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు చెప్పారు.