AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమెడియన్‌ను పెళ్లాడిన ప్రముఖ నటి.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..

నటి మాన్వి గాగ్రూ, హాస్యనటుడు వరుణ్ కుమార్‌ల వివాహం గురువారం (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా జరిగింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు..

కమెడియన్‌ను పెళ్లాడిన ప్రముఖ నటి.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..
Maanvi Gagroo Marriage
Srilakshmi C
|

Updated on: Feb 23, 2023 | 7:32 PM

Share

‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’నటి మాన్వి గాగ్రూ, హాస్యనటుడు వరుణ్ కుమార్‌ల వివాహం గురువారం (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా జరిగింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నూతన వధూవరులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అతికొద్దిమంది బంధుమిత్రుల సమయంలో ‘ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 23న వివాహబంధంతో మేము ఒక్కటయ్యాం. దీన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటివరకు మా ఇద్దరినీ ఆదరించారు. మా ప్రయాణంలో ఇకపై కూడా మీ ఆదరణ కొనసాగాలని కోరుతున్నాం’ అనే క్యాప్షన్‌తో ఫొటోలను షేర్‌ చేశారు. మాన్వి ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా.. వరుణ్‌ తెలుపురంగు వస్త్రాలు ధరించి తలకు పాగా ధరించాడు. వివాహ రిజిస్ట్రేషన్‌లో భాగంగా రిజిస్టర్‌పై సంతకం చేస్తున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు.

కాగా హాస్యనటుడిగా, రచయితగా పాపులారిటీ సంపాదించుకున్న కుమార్ వరుణ్ మరియు కామెడీ కలెక్టివ్ AIB (ఆల్ ఇండియా బక్‌చోడ్), ‘చాచా విధాయక్ హై హమారే’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. లాక్డౌన్ సమయంలో బాగా పాపులర్ అయిన ‘క్విజింగ్ విత్ ది కమెడియన్స్’ అనే క్విజ్ షోకు కుమార్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మాన్వీ గాగ్రూ పీకే, ఉజ్దా చమాన్‌, శుభ్‌ మంగళ్‌ జ్యాద సావధాన్‌, ఆమ్రాస్‌: ద స్వీట్‌ టేస్ట్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌, ఎ క్వశ్చన్‌ మార్క్‌, గాయ్‌ ఇన్‌ ద స్కై, ఉజ్దా చామన్‌, 377 అబ్‌నార్మల్‌ వంటి తదితర మువీలతోపాటు ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌, పిచర్స్‌, ట్రిప్లింగ్స్‌, తామశ్రీ వంటి వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.