Weekend Hour: వంశీ యాక్షన్.. లోకేష్ రియాక్షన్..! టీడీపీకి జూనియర్ ఎన్టీఆరే దిక్కా..
అటు టీడీపీలో తారక మంత్రం.. ఇటు బీజేపీలో వీర్రాజుపై అసమ్మతీ పంతం. యస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ రెండు అంశాలు సంచలనంగా మారాయి. లోకేష్ ప్రకటనతో మళ్లీ తెలుగుదేశంలో జూనియర్ చుట్టూ రచ్చ సాగుతుంటే.. బీజేపీలో సోము వీర్రాజును ఇంటికి పంపితేనే పార్టీ బాగుపడుతుందంటూ అసమ్మతీవర్గం డిమాండ్ కలకలం రేపింది.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దిక్కా.. ఒకప్పుడు పార్టీలో యాక్టీవ్‌గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత లోకేష్ ఎంట్రీతో సైడ్ చేశారన్న ప్రచారముంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే వందశాతం స్వాగతిస్తామన్న లోకేష్ తాజా ప్రకటన రచ్చరచ్చగా మారింది. మరోసారి టీడీపీ రాజకీయ చిత్రంలో జూనియర్ పాత్రపై చర్చలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎలాంటి స్పందన ఉందో కానీ… అవకాశం కోసం రెడీగా ఉండే వైసీపీ నేత కొడాలి మాత్రం పదునైన విమర్శలతో మరోసారి లోకేష్ చంద్రబాబులపై విమర్శలతో రెచ్చిపోయారు.
పసుపుపార్టీలో ఫ్యామిలీ కథ అలా ఉంటే.. బీజేపీ ఎదుగుదలకు సోము వీర్రాజే అడ్డు అంటూ అసమ్మతీ వర్గం అంటోంది. సోమువీర్రాజుపై ఇప్పటికే వరుస ఫిర్యాదులు అందాయి. జిల్లాల అధ్యక్షుల మార్పుతో వివాదాలు మొదలయ్యాయి. ఓ వర్గాన్ని సోమువీర్రాజు టార్గెట్ చేశారన్న విమర్శలున్నాయి. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాముఖ్యత తగ్గుతోందని అంటున్నారు అసమ్మతి నేత దారా సాంబయ్య. కాపు, కమ్మ, రెడ్డి వర్గాల రాజ్యం నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాజమండ్రి వేదికగా ఏపీ బీజేపీపై పోస్ట్‌మార్టం ప్రారంభించారు కేంద్ర మంత్రి, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్.
అటు బీజేపీకి సోము వీర్రాజు అడ్డు అయితే… టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దిక్కు అంటూ సాగుతున్న ఈ రాజకీయ రచ్చ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
వీకెండ్ అవర్ విత్ మురళీకృష్ణ ఫుల్ వీడియో ఈ కింద వీక్షించండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..