Billionaire Commits Suicide: గన్‌తో కాల్చుకుని ప్రముఖ బిలియనీర్ ఆత్మహత్య..! ఏం జరిగిందో..

అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ గురువారం (ఫిబ్రవరి 24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమెరికాలో ప్రముఖ పెట్టుబడుల సంస్థ అయిన లీ ఈక్విటీ అధినేత, బిలియనీ.. థామస్ లీ (78) మాన్‌హట్టన్‌లోని తన కార్యాలయంలో..

Billionaire Commits Suicide: గన్‌తో కాల్చుకుని ప్రముఖ బిలియనీర్ ఆత్మహత్య..! ఏం జరిగిందో..
American Billionaire Thomas Lee
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2023 | 5:07 PM

అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ గురువారం (ఫిబ్రవరి 24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమెరికాలో ప్రముఖ పెట్టుబడుల సంస్థ అయిన లీ ఈక్విటీ అధినేత, బిలియనీర్.. థామస్ లీ (78) మాన్‌హట్టన్‌లోని తన కార్యాలయంలో తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు ఆఫీస్‌కు వచ్చిన లీ చాలా సేపటి వరకు గది నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా.. బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లీ తలపై బుల్లెట్‌ గామం ఉన్నట్లు గమనించారు. అతని పక్కనే పడి ఉన్న స్మిత్ అండ్‌ వెసన్ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో లభ్యమైన తుపాకీ.. లీ పేరుతో రిజిస్టరయ్యి, లైసెన్స్ పొందిన తుపాకీగా పోలీసులు గుర్తించారు. లీ 11 గంటల 26 నిముషాలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను ఇంకా తెలియరాలేదు.

కాగా దాదాపు 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 16,500 కోట్లు) అధినేత అయిన ఇన్వెస్టర్, ఫైనాన్షియర్‌గా థామస్ లీ కి అమెరికాలో మంచి పేరుంది. థామస్ హెచ్ లీ తొలుత పార్ట్నర్స్ పేరుతో 1974లో ఓ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 2006 లో ఈక్విటీని మొదలు పెట్టారు. దాదాపు 50 ఏళ్లుగా ఆయన వందలాది సంస్థల్లో 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో లీకి మంచి స్నేహం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.