- Telugu News Photo Gallery World photos Us snow storm: Snow, Rain Slam California As Michigan State Suffers Without Power
US Snow Strom: అగ్రరాజ్యంలో మంచు వర్షం బీభత్సం.. అంధకారంలో పలు నగరాలు.. రెడ్ అలర్ట్ ఇష్యూ..
అగ్రరాజ్యం అమెరికాలో మంచు వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అసాధారణ వాతావరణంతో అమెరికెన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు మడిస్తుంటే.. మరోవైపు మంచు తుఫాన్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Updated on: Nov 23, 2023 | 1:16 PM

ఓ వైపు మంచు తుఫాన్.. మరోవైపు మండిస్తున్న ఎండలు..విభిన్న వాతావరణంతో అమెరికెన్లు విలవిల్లాడుతున్నారు. అసాధారణ వాతావరణంతో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడిపోతోంది. ఒకవైపు గడ్డకట్టే చలి, మరోవైపు భరించలేని ఎండలు అమెరికన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నార్త్ అండ్ వెస్ట్‌లో స్నో బీభత్సం సృష్టిస్తుంటే, ఈస్ట్‌లో హై టెంపరేచర్స్ టాప్ లేపుతున్నాయి. మొత్తానికి భిన్న వాతావరణంతో అమెరికా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అగ్రరాజ్యం మరోసారి మంచు గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మంచు తుఫాను దెబ్బకు మరోసారి విలవిల్లాడుతోంది. పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు మంచు వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మంచు తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో.. 15వందలకు పైగా విమానాలను రద్దు చేశారు.

లాస్‌ఏంజెల్స్, మిచిగాన్, మిన్నెసోటా, డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ, మినియా పొలిస్, సెయింట్‌పాల్, వ్యోమింగ్ నగరాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది అమెరికా జాతీయ వాతావరణశాఖ.

రాబోయే రోజుల్లో మంచు వర్షం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించింది. మంచు తుఫానుతోపాటు గంటకు 70కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ముందుగా హెచ్చరికాలు జారీ చేసింది.

అత్యంత ప్రమాదకర వింటర్ స్నో సైక్లోన్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది అమెరికా వెదర్ డిపార్ట్‌మెంట్. ఇళ్ల నుంచి బయటికి వస్తే కచ్చితంగా సేఫ్టీ కిట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది.

ఒకవైపు మంచు తుఫాను అమెరికన్లు వణికిస్తుంటే, తూర్పు ప్రాంతంలో అసాధారణ ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తానికి అమెరికా అసాధారణ వాతావరణంతో విలవిల్లాడుతోంది. దీంతో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టాలంటేనే వణికిపోతున్నారు అమెరికన్లు. రోడ్లపై గుట్టలుగుట్టలుగా మంచు పేరుకుపోవడంతో రహదారులన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయి.





























