Oldest cities in the world: వేల సంవత్సరాల చరిత్ర.. చెక్కు చెదరని కళా వైభవం.. ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం ఏది? అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కో నగరానికి ఒక్కో చారిత్రక నేపథ్యం ఉంటుంది. ప్రతి నగరానికి దాని విశిష్టత దానికి ఉంటుంది. పురావస్తు శాస్త్రవేత్తల పని అదే. అక్కడి సంప్రదాయం, సంస్కృతి, జీవన విధానం వంటి వాటిపై ఆధారపడి ఆ నగర చరిత్రను వివరిస్తారు. ఈ ఆధునిక యుగంలో అనేక మంది రాజులు, రాజ్యాలు అంతరించిపోయిన.. ఆనాటి కళా వైభవం నేటికీ కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంటుంది. మీకు అటువంటి ప్రదేశాలను, అలనాటి కట్టడాలను చూడాలని ఇష్టపడితే మీ కోసమే ఈ కథనం. ప్రపంచంలోని అత్యంత పురాతన, చారిత్రక నేపథ్యం ఉన్న నగరాలను మీకు పరిచయం చేస్తున్నాం. మీరూ ఓ సారి చుట్టేసి రండి..