Unmarried Life: ఒంటరి జీవితానికి అలవాటు పడుతోన్న యువత.. 40 కోట్లకు చేరుకున్న అవివాహిత జనాభా..

కోవిడ్‌ కారణంగా అక్కడ మృతుల సంఖ్య పెరగడం ఓ కారణమైతే.. పెరుగుతున్న విడుకులు, యువత అవివాహితులుగా మిగిలిపోవడం తెర వెనుక అసలుకారణాలని తాజా సర్వేలో బయటపడింది..

Unmarried Life: ఒంటరి జీవితానికి అలవాటు పడుతోన్న యువత.. 40 కోట్లకు చేరుకున్న అవివాహిత జనాభా..
Unmarried Life
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2023 | 6:01 PM

గడచిన ఆరు దశాబ్ధాల కాలంలో 2022లో తొలిసారిగా చైనా జనాభా శాతం దారుణంగా క్షీనించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ కారణంగా అక్కడ మృతుల సంఖ్య పెరగడం ఓ కారణమైతే.. పెరుగుతున్న విడుకులు, యువత అవివాహితులుగా మిగిలిపోవడం తెర వెనుక అసలుకారణాలని తాజా సర్వేలో బయటపడింది. చైనాలో 30 ఏళ్లు పైబడిన పెళ్లికాని యువత అధికంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. నగరాల్లో చాలా మంది యువతీ యువకులు ఒంటరిగా జీవించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తోంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లుపైబడిన పురుషులు అసలు పెళ్లి ఊసే ఎత్తడంలేదని చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ సినా వీబో వెల్లడించింది. సోలో బ్రతుకే సో బెటర్‌ అనే భావన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. 2022 నాటి పెండ్లి కాని యువత సంఖ్య 40 కోట్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెల్పుతున్నాయి. మరోవైపు చైనాలో విడాకుల రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మహిళలు వివాహానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పురుషులు అందుబాటులో లేనట్లు వీబో తెల్పింది.

చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2018లో చైనాలో అవివాహిత జనాభా 240 మిలియన్లు ఉన్నారు. 2021లో వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య కేవలం 7.636 మిలియన్లు మాత్రమే నమోదయ్యాయి. పడిపోతున్న వివాహ రేటు జననాల రేటు గణనీయంగా పడిపోవడానికి దారితీస్తోంది. ఉద్యోగం పొందడం కష్టతరం కావడం, జీవన వ్యయం పెరగడం వల్ల ఒంటరిగా బతకాలని చాలామంది యువకులు భావిస్తున్నారు. మరోవైపు వివాహం చేసుకున్న జంటలు పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపడం లేదు. విద్య ఖరీదైపోవడం, ఇంట్లో పెద్దలు, పిల్లలు ఉంటే బతుకు భారమవుతుందని భావించడమే ఇందుకు కారణం. గత దశాబ్ద కాలంలో కఠినమైన కుటుంబ నియంత్రణ నిబంధనలు రెండుసార్లు సవరించింది కూడా. కొత్త జంటలకు అదనపు సెలవు. మెరుగైన ప్రసూతి సెలవులు, వర్కింగ్‌ మదర్‌లకు రక్షణ.. వంటి వివాహాలు, జననాలను ప్రోత్సహించడానికి ఆ దేశ ప్రభుత్వం నజరానాలు ప్రకటిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించడం లేదు. వివాహాన్ని ప్రోత్సహించడం మరియు పిల్లలను కనడం వంటి అనేక ప్రోత్సాహకాలను కూడా అందించాయి. అయితే 2014 నుంచి ఏటా పెళ్లి రేటు తగ్గుతూ వస్తోంది. ఇది చైనా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.