- Telugu News Photo Gallery Cinema photos Parineeti Chopra reveals her relationship status says 'Right now, there is no one in my life. I haven’t found my special one yet'
‘నా స్టేటస్ సింగిల్.. ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పండి..’ స్టార్‌బ్యూటీ ఓపెన్ కామెంట్స్
నయనతార, కత్రీనా కైఫ్, కాజల్, ఆలియా, కియారా అద్వానీ ఇలా.. బాలీవుడ్ బ్యూటీలంతా వరుసగా పెళ్లి భాజాలు మోగిస్తున్నారు. ఇక ఈ వరుసలో చేరనున్న మరో..
Updated on: Feb 25, 2023 | 3:40 PM

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్ రూమర్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ వార్తలపై వీరిరువురూ స్పందించలేదు. ఇటీవల కొన్ని కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి రావడం రూమర్స్‌కు మరింత బలం చేకూర్చినట్లైంది.

తిరంగా సహనటుడు హార్డీ సంధు ఈ పుకార్లను బలపరిచేలా ఓ మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ.. 'పరిణీతికి కాల్ చేసి అభినందనలు తెలిపాను. చివరికి ఇది జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని' చెప్పుకొచ్చాడు. మార్చి 28న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా కూడా సోషల్ మీడియా వేదికగా పరిణీతి, రాఘవ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు కూడా.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గుంచి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

గత నెలలో ముంబైలో లంచ్ డేట్‌లో కలిసి కనిపించిన తర్వాత ఈ జంట ప్రేమాయణంపై వార్తలు వండి వార్చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. తాజాగా ఈ జంటకు సంబంధించిన క్రేజీ న్యూస్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా..? అన్న ప్రశ్నకు పరిణితి సమాధానం ఇస్తూ.. 'ప్రస్తుతానికి నా జీవితంలో ఎవరూ లేరు.. నేను సింగిల్. మీకు తెలిసిన అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పండి.. అప్పుడు నేను కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాను' అని వెల్లడించింది.




