Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్గొండ ట్రయాంగిల్‌ క్రైమ్‌ లవ్‌ స్టోరీలో సంచలన విషయాలు.. హరిహర కృష్ణకు 14 రోజుల రిమాండ్‌..

నల్గొండ ట్రయాంగిల్‌ క్రైమ్‌ లవ్‌ స్టోరీలో నిందితుడు హరహర కృష్ణని హయత్ నగర్ కోర్టులో హరిని హాజరుపరిచారు. విచారించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది..

నల్గొండ ట్రయాంగిల్‌ క్రైమ్‌ లవ్‌ స్టోరీలో సంచలన విషయాలు.. హరిహర కృష్ణకు 14 రోజుల రిమాండ్‌..
Hyderabad Abdullapurmet Cas
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2023 | 7:46 AM

నల్గొండ ట్రయాంగిల్‌ క్రైమ్‌ లవ్‌ స్టోరీలో నిందితుడు హరిహర కృష్ణని హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం హరిని పోలీసులు జైలుకు తరలించారు. ఈనెల 21 న కాలేజ్ కి వెళ్తున్నట్టు ఇంట్లో అక్క బావ లకు చెప్పిన హరి.. ఆరోజు సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. రెండ్రోజులైనా ఇంటికి రాక పోవడంతో హరి అక్కా బావ కంగారు పడ్డారు. దీంతో హరి కనిపించలేదంటూ ఈ నెల 23న మలక్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హరి బావ. ఫిర్యాదు మేరకు మలక్ పేట్ పోలీసులు హరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హరి ఫిబ్రవరి 24 పోలీసులకు లొంగిపోయాడు.

కాగా హరికృష్ణ నవీన్ మర్డర్ చేసిన తీరు అత్యంత సంచలనగా మారింది. నవీన్‌ని హత్య చేసిన తీరు చూసి తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు. హరిహర కృష్ణ.. నవీన్ హత్య విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక షాపింగ్ మాల్లో రెండు నెలల క్రితమే.. కత్తి కొని, ఆ కత్తిని తన స్కూటీలో పెట్టుకుని తిరిగినట్టు గుర్తించారు పోలీసులు. కత్తి పట్టుకున్న టైంలో.. చేతికి గ్లౌజులు కూడా తొడుక్కున్నట్టు ఐడెంటిఫై చేశారు. మృతదేహం ఆనవాళ్లు కనిపించకుండా.. శరీరంపై దుస్తులను సైతం.. తొలగించాడు హరి. నవీన్ వేలు, పెదవులు, గుండె సైతం నరికి..ఆ ఫోటోలను గర్ల్‌ ఫ్రెండ్‌కి మెసేజ్ పెట్టడం..అందుకామె.. అవునా, ఓకే అంటూ.. లైట్ తీస్కుంటూ రిప్లై ఇవ్వడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య విషయంలో.. ఆమె పాత్రపై ఆరా తీస్తున్నారు. నవీన్ ను హత్య చేసే ముందు ముసరంబాగ్ లోని ఇంటికి తీసుకొచ్చాడు హరహర కృష్ణ. ఈ నెల 17 న హైదరాబాద్‌కు వచ్చిన నవీన్ ను సాయంత్రం వరకు ముసరంబాగ్ లో తిప్పిన హరి.. రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి నవీన్ ను తీసుకుని అబ్దుల్లాపూర్ మెట్ కి వెళ్లినట్టు గుర్తించారు. నవీన్ కేసు విషయంలో దర్యాప్తు పూర్తయ్యాక కానీ అసలు విషయాలు వెలుగులోకి రావంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు