Hyderabad Traffic Restrictions: నగరవాసులకు ముఖ్య గమనిక.. ఇవాళ ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే

నగరవాసులకు ముఖ్య గమనిక.. ఆదివారం (ఫిబ్రవరి 26) గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Hyderabad Traffic Restrictions: నగరవాసులకు ముఖ్య గమనిక.. ఇవాళ ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే
Traffic Restrictions
Follow us
Basha Shek

|

Updated on: Feb 26, 2023 | 5:45 AM

నగరవాసులకు ముఖ్య గమనిక.. ఆదివారం (ఫిబ్రవరి 26) గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంగీత దిగ్గజం, మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్‌ కన్సర్ట్‌ కారణంగా ఈ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా సంగీత కచేరి జరగనుంది. ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని సీపీ తెలిపారు. అలాగే గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లి వైపు, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు భారీ వాహనాలు అనుమతించరు. ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, ఆర్‌ఎంసీలు, వాటర్ ట్యాంకర్లకు పర్మిషన్‌ లేదు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులివే..

లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనాలను హెచ్‌సీయూ బస్‌ డిపో వద్ద ఎస్‌ఎంఆర్‌ వినయ్‌సిటీ, మసీద్‌బండ, బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి వైపు మళ్లించనున్నారు.

గచ్చిబౌలి సర్కిల్‌ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్‌ గార్డెన్, మసీద్‌బండ, హెచ్‌సీయూ బస్‌ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గోపీచంద్‌ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్‌పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్‌ నుంచి వెళ్లాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?