AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ సంగీత ప్రియులకు పండగే.. హైదరాబాద్‌లో ఇళయరాజా మ్యూజికల్‌ ఈవెంట్‌.. హాజరుకానున్నకేటీఆర్‌, చిరంజీవి, నాగార్జున

సంగీత దిగ్గజం, మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజికల్ లైవ్ ఈవెంట్‌కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఇవాళ (ఫిబ్రవరి 26)  గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ లైవ్‌ కన్సర్ట్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇవాళ సంగీత ప్రియులకు పండగే.. హైదరాబాద్‌లో ఇళయరాజా మ్యూజికల్‌ ఈవెంట్‌.. హాజరుకానున్నకేటీఆర్‌, చిరంజీవి, నాగార్జున
Ilaiyaraaja Live Concert
Basha Shek
|

Updated on: Feb 26, 2023 | 6:48 AM

Share

సంగీత దిగ్గజం, మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజికల్ లైవ్ ఈవెంట్‌కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఇవాళ (ఫిబ్రవరి 26)  గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ లైవ్‌ కన్సర్ట్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకులు మల్కాపురం సాయినాథ్ గౌడ్ ఈ వేడుకను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితరులు ఈ మ్యూజికల్ లైవ్ ఈవెంట్‌కు ప్రధాన అతిథులుగా హాజరకానున్నారు. కాగా ఈ లైవ్‌ కన్సర్ట్‌ కోసం ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టారు ఇళయరాజా. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించేందుకు సినీ తారలు, రాజకీయ వేత్తలను కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆహ్వానించారు. గచ్చిబౌళి స్టేడియంలో సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ లైవ్ కన్సర్ట్‌ను చూసేందుకు దాదాపు 20,000 మందికి పైగా హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు.

కాగా ఈ కార్యక్రమానికి సంగీత ప్రియులతోపాటు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీవీఐపీలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి 26న గచ్చిబౌలి ఏరియాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళయరాజా సంగీత కచేరి టికెట్లు కావాల్సిన వారు ముందస్తుగా ఆన్ లైన్‌లో కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. అలాగే స్టేడియంలోకి అరగంట ముందే చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..