Viral Video: నీళ్లలో బాతుల వినూత్న డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో

హ్యాపీ మూడ్‌లో రెండు బాతులు జతకట్టి నీళ్లపై తేలియాడుతూ మెడలు వంచుకుని డ్యాన్స్‌ చేయడం వీడియోలో కనిపిస్తుంది. చూడటానికి ఎంతో ముచ్చటగొలిపేలా ఉన్న ఈ బాతుల వింత డ్యాన్స్‌..

Viral Video: నీళ్లలో బాతుల వినూత్న డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో
Ducks Dance In Water
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2023 | 4:22 PM

ఎండాకాలం దాదాపు ప్రారంభమైనట్టే.. ఈ కాలంలో మనుషులతోపాటు జంతువులు, పక్షులు కూడా చల్లని ప్రాంతాల్లో చిల్‌ అవడానికి చాలా ఇష్టపడతారు. సాయంసంధ్య వేళల్లో అలా పార్కులకుగానీ వాటర్‌ ఫాల్స్‌ వద్దకు గానీ వెళ్లి కాసేపు మనసారా సేదతీరితే ఆ హాయి మాటల్లోచెప్పలేనిది. మనుషుల్లాగే పక్షులు కూడా అల్లర్లు, ఆటపాటలు ఎంజాయ్‌ చేస్తాయని చాలా మందికి తెలియదు. రద్దీ ప్రాంతాల్లో సాధారణంగా పక్షులు, జంతువులు కనిపించవు. అటవీ ప్రాంతాల్లో, జనావాసాలకు దూరంగా ఉండే కొలనుల్లో వాటి విన్యాసాలు చూడాలేగానీ మనుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎంజాయ్‌ చేస్తుంటాయి. నమ్మబుద్ధి కావడం లేదా..? ఐతే ఈ వీడియోవైపు మీరూ ఓ లుక్కేసుకోండి..

ఈ వీడియోలో రెండు బాతులు కొలనులో ఈత కొడుతూ ఉంటాయి. కొంతసేపటికి నీళ్లలో ఆడుతూ చిత్రవిచిత్రంగా హుషారెత్తిపోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత రెండు బాతులు ఎవరో కొరియోగ్రాఫర్‌ స్టెప్పులేసి చేయమని చెప్పినట్లు.. రెండూ ఒకేలా డ్యాన్స్‌ చేయడం కనిపిస్తుంది. హ్యాపీ మూడ్‌లో రెండు బాతులు జతకట్టి నీళ్లపై తేలియాడుతూ మెడలు వంచుకుని డ్యాన్స్‌ చేయడం వీడియోలో కనిపిస్తుంది. చూడటానికి ఎంతో ముచ్చటగొలిపేలా ఉన్న ఈ బాతుల వింత డ్యాన్స్‌ నెటిజన్లను అమితాశ్చర్యాలకు గురిచేస్తోంది. వీటి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ సైట్‌ అప్‌లోడ్‌ చేసింది. పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట మళ్లీ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూపిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?