Congress 85th Plenary: ‘నాకు ప్రస్తుతం 52 ఏళ్లు.. ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు’..: రాహుల్‌ గాంధీ

తనకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం (ఫిబ్రవరి 26) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ..

Congress 85th Plenary: 'నాకు ప్రస్తుతం 52 ఏళ్లు.. ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు'..: రాహుల్‌ గాంధీ
Rahul Gandhi
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 27, 2023 | 10:34 AM

తనకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం (ఫిబ్రవరి 26) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన చిన్ననాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘నా చిన్న తనంలో మా కుటుంబం నివసించే ఇల్లు మాదేనని అనుకున్నాను. కానీ ఓ రోజు మా అమ్మ ఈ ఇల్లు వదిలి వేరే చోటికి వెళ్తున్నామని చెప్పింది. అప్పటి వరకు అది మా ఇల్లేనని అనుకున్నాను. అప్పుడు మా అమ్మ ఇది మన ఇల్లు కాదు.. ప్రభుత్వానిది అని నాకు చెప్పింది. ఆ విషయం తెలిసిన తర్వాత నేను చాలా కంగారు పడ్డాను. తర్వాత ఎక్కడికి వెళ్తున్నామని తల్లి సోనియా గాంధీని అడిగాను. అప్పుడు అమ్మ నాకు తెలియదు (నహీ మాలూమ్)’ అని సమాధానం చెప్పినట్లు రాహుల్‌ గాంధీ గుర్తుచేసుకున్నారు.

నాకు ఇప్పుడు 52 ఏళ్లు. ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు. ప్రస్తుతం అలహాబాద్‌లో మా కుటుంబం ఉంటున్న ఇల్లు కూడా మాది కాదు. నేను తుగ్లక్ లేన్‌ 12లో ఉంటున్నాను. కానీ అది నాకు ఇల్లు కాదు. నేను భారత్ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు, యాత్రలో చేరిన ప్రజలందరినీ చూసిన తర్వాత నా బాధ్యత ఏమిటో తెలిసొచ్చింది. యాత్రలో భాగంగా నన్ను కలవడానికి వచ్చేవారు తమ స్వంతవారితో మాట్లాడే అనుభూతికలగాలని నా ఆఫీసు వాళ్లతో చెప్పాను. యాత్ర మా ఇళ్లు వంటిది. ధనిక, పేద తారతమ్యభేదాలు లేకుండా ఈ ఇంటి తలుపులు అందరి కోసం ఎల్లప్పుడు తెరిచే ఉంటాయి. ఇది చాలా చిన్ని ఆలోచన అయినప్పటికీ యాత్రలో ఇంటింటికి వెళ్లినప్పుడు దానిలోతు నాకు అర్థమైందని రాహుల్‌ తన ప్రసంగంలో భావోధ్వేగానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

రాహుల్‌ గాంధీ ప్రసంగంపై బీజేపీ నేత సంబిత్ పాత్ర .. రాహుల్ గాంధీకి తన బాధ్యతలు తెలుసుకోవడానికి 52 ఏళ్లు పట్టింది. ఇన్నాళ్ల తన బాధ్యతల గురించి రాహుల్‌ గాంధీ ఆలోచించడం ప్రారంభించాడు. పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్న తర్వాత తన బాధ్యతల గురించి మాట్లాడుతున్నాడు. రాహుల్ జీ.. మిగతా గాంధీ కుటుంబ సభ్యుల మాదిరిగానే మీది బాధ్యత లేని అధికారం. 52 ఏళ్ల తర్వాత మీరు గ్రహించిన విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ తన రాజకీయ జీవితం ఆరంభంలోనే గ్రహించారు. ప్రభుత్వ గృహాలన్నీ మీకే చెందుతాయని భావించడాన్ని ఇంగ్లిష్‌లో సెన్స్ ఆఫ్ ఎనిటిల్‌మెంట్ అంటారు’ అని సంబిత్ పాత్ర సోషల్‌ మీడియా వేదికగా చమత్కరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.