AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : ధోనీకి ప్రతి నెలా రూ.70,000 పెన్షన్.. బీసీసీఐ ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవే

MS Dhoni : టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ చరిత్రలో ముగ్గురు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీకి, బీసీసీఐ నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతోంది.

MS Dhoni : ధోనీకి ప్రతి నెలా రూ.70,000 పెన్షన్.. బీసీసీఐ ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవే
Ms Dhoni
Rakesh
|

Updated on: Feb 15, 2026 | 9:51 AM

Share

MS Dhoni : టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ చరిత్రలో ముగ్గురు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీకి, బీసీసీఐ నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతోంది. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, దేశం కోసం ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ పెన్షన్ లభిస్తోంది. టీమిండియాకు ఆడిన మ్యాచుల సంఖ్య ఆధారంగా బీసీసీఐ మాజీ ఆటగాళ్లకు పెన్షన్ అందిస్తుంది. 2022లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచారు. ఈ నిబంధనల ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ ఆటగాళ్లకు అత్యున్నత పెన్షన్ కేటగిరీ కింద నెలకు రూ.70,000 చెల్లిస్తారు. ధోనీ తన కెరీర్‌లో 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు కాబట్టి, ఆయన ఈ అత్యున్నత కేటగిరీ కింద పెన్షన్ పొందుతున్నారు.

ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ధోనీ పెన్షన్ ఎంత?

బీసీసీఐ పెన్షన్ విధానం ఆటగాడి అనుభవంపై ఆధారపడి ఉంటుంది:

నెలకు రూ. 70,000: ధోనీతో పాటు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు ఈ అత్యధిక పెన్షన్ పొందుతున్నారు.

నెలకు రూ. 60,000: యువరాజ్ సింగ్ లాంటి మాజీ టెస్ట్ ప్లేయర్లు ఈ విభాగంలో ఉన్నారు.

నెలకు రూ. 30,000 నుంచి 45,000: ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మాజీ ఆటగాళ్లు, మహిళా క్రికెటర్లకు వారి అనుభవాన్ని బట్టి ఈ మొత్తం అందుతుంది. (ఉదాహరణకు వినోద్ కాంబ్లికి రూ. 30,000 అందుతోంది).

ధోనీ సాధించిన రికార్డులు..

2004లో అరంగేట్రం చేసిన ధోనీ, భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేశారు. ఆయన సారథ్యంలో భారత్ సాధించిన ప్రధాన విజయాలు ఇవే:

2007: తొలి టీ20 వరల్డ్ కప్ విజయం.

2011: 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ వన్డే వరల్డ్ కప్ కైవసం.

2013: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు.

2025: క్రికెట్‌లో ఆయన చేసిన కృషికి గాను ICC హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది.

ధోనీ మొత్తం 538 అంతర్జాతీయ మ్యాచుల్లో 17,266 పరుగులు సాధించారు. వికెట్ కీపింగ్‌లోనూ ఎవరికీ అందనన్ని రికార్డులు ఆయన సొంతం.

ఆ పెన్షన్ డబ్బును ధోనీ ఏం చేస్తారు?

ధోనీ నెట్ వర్త్ (ఆస్తుల విలువ) సుమారు రూ.1000 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, తనకు వచ్చే పెన్షన్ మొత్తాన్ని ధోనీ తన సొంత అవసరాలకు కాకుండా, చారిటీ (సేవా కార్యక్రమాల) కోసం ఉపయోగిస్తారని సమాచారం. ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే ధోనీ, తన సేవా కార్యక్రమాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. దేశం తన వీరులకు ఇచ్చే ఈ గౌరవ వేతనం, ఆర్థిక సహాయం కంటే కూడా ఒక గుర్తింపుగా ధోనీ భావిస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us