AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలెంటైన్స్‌ డే సాక్షిగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఒకరితో ఒకరు ప్రత్యేక రోజుగా సంబరాలు జరుపుకున్నారు. కానీ, ఒక ప్రేమకథ విషాదకరమైన మలుపు తిరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసింది. ప్రేమికుల రోజున జరిగిన ఈ దారుణ సంఘటన యావత్‌ దేశాన్ని కుదిపేసింది. తన వివాహిత ప్రేమికుడిని నమ్మి అతని వెంట వెళ్ళిన ఒక అందమైన యువతి ఇప్పుడు దారుణమైన స్థితిలో విగత జీవిగా కనిపించింది. ప్రేమించిన పాపానికి ఇప్పుడు జీవితమే లేకుండా పోయింది. ఇంతకీ ఏం జరిగింది..?

వాలెంటైన్స్‌ డే సాక్షిగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
Women Killed By Married Lov
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2026 | 7:37 AM

Share

మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియా దాదాపు ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమీర్‌ను కలిసింది. సాధారణ చాటింగ్‌తో మొదలైన వారి స్నేహం తరువాత ప్రేమగా మారింది. సమీర్‌ను ఎక్కువగా నమ్మిన సియా, తన స్వస్థలాన్ని విడిచిపెట్టి అతనితో కలిసి జీవించడానికి కేవలం మూడు నెలల క్రితమే భోపాల్‌కు వెళ్లిపోయింది.. కానీ అక్కడికి చేరుకున్న తర్వాతే, సమీర్‌కు ఇప్పటికే వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారనే చేదు నిజం ఆమెకు తెలిసింది.

సియా సమీర్ ఇంట్లో ఉండటం మొదలుపెట్టిన తర్వాత ప్రతిరోజూ గొడవలు జరగడం ప్రారంభించాయి. సమీర్ భార్య, సియా మధ్య గొడవ గురించి పొరుగువారికి కూడా తెలిసింది. ఒకవైపు కుటుంబ కలహాలు పెరిగాయి. మరోవైపు, సియా తనను వివాహం చేసుకోవాలని సమీర్ పై ఒత్తిడి తెస్తోంది. తనను వివాహం చేసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పట్టుబట్టింది. ఆమె రూ.5 లక్షలు డిమాండ్ చేసిందని, నిరాకరిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించిందని దర్యాప్తు అధికారుల దర్యాప్తులో తేలిసింది. ఈ చికాకు భరించలేక సమీర్ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుండగా, సమీర్ సియాను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చి, వారి సహాయంతో మృతదేహాన్ని ఇనుప పెట్టెలో కుక్కేశాడు.. అర్ధరాత్రి, ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలో అతను ఆ పెట్టెను సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి పడవేశాడు. కానీ, సెప్టిక్‌ ట్యాంక్ నుండి భరించలేని దుర్వాసన రావడం గమనించిన స్థానికులు వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్యాంక్ లోపల ఉన్న పెట్టెను తొలగించగా సియా మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది.

ఇవి కూడా చదవండి

మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయినప్పటికీ, ఆమె చేతిపై ఉన్న దీపం పచ్చబొట్టు, ఆమె పుట్టిన తేదీ ఆధారంగా పోలీసులు ఆమెను సియాగా గుర్తించారు. కేసు నమోదు చేసిన కేవలం 24 గంటల్లోనే పోలీసులు హత్య మిస్టరీని ఛేదించారు. హంతకుడు సమీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనికి సహాయం చేసిన అతని తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు. సియా గతంలో మూడుసార్లు వివాహం చేసుకున్నట్లు కూడా దర్యాప్తులో తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..