ఖాళీ కడుపుతో దొండ‌కాయ‌ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?

14 February 2026

Jyothi Gadda

దొండ‌కాయ‌ల్లో క్యాల‌రీలు చాలా స్వ‌ల్పంగా ఉంటాయి. వీటిల్లో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌రల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు పోష‌ణ‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. దొండ‌కాయ జ్యూస్‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగుతుండాలి. దీని వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉప‌యోగించుకుంటుంది.

దీంతో గ్లూకోజ్ మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దొండ‌కాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఫైబ‌ర్ కార‌ణంగా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు.

దొండ‌కాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ కార‌ణంగా జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. వీటిని తింటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. దొండ‌కాయ‌ల్లో విట‌మిన్లు సి, ఎ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. కంటి చూపు మెరుగు ప‌డేలా చేస్తాయి. ఈ కాయ‌ల్లో ఉండే బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాల వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది.

దొండ‌కాయ‌ల‌ను తింటే పొటాషియం అధికంగా ల‌భిస్తుంది. ఇది ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. దీని వ‌ల్ల హైబీపీ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది.