Kidney for sale: బెంగళూరులో ఇంటి అద్దె చెల్లించలేక.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన టెకీ..
టెక్ క్యాపిటల్‌లో అయిన బెంగళూరు నగరంలో ఇంటి అద్దె కట్టడానికి ఓ వ్యక్తి ఆదివారం (ఫిబ్రవరి 26) తన కిడ్నిని అమ్మకానికి పెట్టాడు. అందుకు పోస్టర్లను తయారు చేసి..
టెక్ క్యాపిటల్‌లో అయిన బెంగళూరు నగరంలో ఇంటి అద్దె కట్టడానికి ఓ వ్యక్తి ఆదివారం (ఫిబ్రవరి 26) తన కిడ్నిని అమ్మకానికి పెట్టాడు. అందుకు పోస్టర్లను తయారు చేసి కనిపించిన చోట్లలో అతికిస్తున్నాడు. వినేందుకు వ్యంగ్యంగా ఉన్నప్పటికీ.. బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్న యువత ఇళ్ల అద్దె చెల్లించడానికి పడుతున్న కష్టాలకు ఈ సంఘటన అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ యవ్వారం నెట్టింట తీవ్ర దుమారానికి తెర లేపింది. వివరాల్లోకెళ్తే..
‘లెఫ్ట్ కిడ్నీ ఆన్ సేల్’ పేరుతో వాల్ పోస్టర్‌ను రమ్యఖ్ అనే యూజర్ ట్వీట్ చేశాడు. ‘ఇంటి యజమాని అద్దెకు అడ్వాన్స్ అడుగుతున్నాడు. అందుకు నాకు డబ్బు కావాలి. అందుకే ఎడమ కిడ్నిని అమ్మకానికి పెట్టినట్లు’ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు కేవలం గంటకుడా గడవకుండానే 60 వేలకుపైగా వీక్షణలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ మరో పోస్టు చేస్తూ.. ‘ఇది నిజంకాదు. నేను జోక్ చేశాను. బెంగళూరులో ఇందిరానగర్‌లో అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాను. నా ప్రొఫైల్ కోసం కోడ్ కోడ్‌ను స్కాన్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు. నెటిజన్లు ఈ పోస్ట్‌పై స్పందిస్తూ ఇది జోక్ అయినప్పటికీ బెంగళూరులో వాస్తవికతకు అద్దం పడుతోందని సమర్ధించారు. నగరంలో ఇళ్ల అద్దె చెల్లించడానికి మా జేబులు ఖాళీ అవుతున్నాయని కామెంట్ సెక్షన్‌లో తమ కష్టాలు చెప్పుకొని కన్నీరుపెట్టుకుంటున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జాబ్ నిమిత్తం ఎందరో బెంగళూరు నగరానికి తరలివస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ పెరుగుతున్న అద్దెలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.
Does this qualify for @peakbengaluru? pic.twitter.com/GGuMZXy2iH
— Ramyakh (@ramyakh) February 25, 2023
While on house hunt lanlord got offended on rejection. Because i said that I’m not interested in making you rich.Instead will opt for Honda City and pay EMI for long commute.
— Abhitosh (@abhitooth) February 26, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.