అయ్యోపాపం.. నెమలి బావిలో పడి..
అడవిని వదిలి జనవాసాల్లోకి వచ్చిన ఓ నెమలి ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, స్థానిక రైతులు సకాలంలో స్పందించి ఆ పక్షి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.గ్రామ శివారులోని ఒక వ్యవసాయ బావిలో జాతీయ పక్షి నెమలి పడిపోవడాన్ని గమనించిన రైతులు, వెంటనే వారంతా కలిసి ఆ మూగజీవిని బయటకు తీశారు. బావిలో నీరు తక్కువగా ఉండటంతో నెమలి తీవ్రంగా గాయపడింది.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు గ్రామానికి చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం దానిని బసంతనగర్‌లోని డీర్ పార్కుకు తరలించారు. ప్రస్తుతం ఆ నెమలి కోలుకుంటోందని అధికారులు వెల్లడించారు.అడవులు అంతరించిపోతుండటం, అటవీ ప్రాంతంలో నీటి లభ్యత తగ్గడంతో వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల శివార్లలో కుక్కలు నెమళ్లపై దాడులు చేస్తున్నాయి. ఆహారం, నీటి కోసం వచ్చి బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. గతంలో మల్లాపూర్ మండలంలో విషగుళికలు తిని నెమళ్లు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అడవులను రక్షించి, చెట్లను పెంచడం ద్వారానే వన్యప్రాణులను కాపాడుకోగలం. ఎక్కడైనా వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తే వాటిని హింసించకుండా తమకు సమాచారం అందించాలని, వాటిని సురక్షితంగా పట్టుకుని తిరిగి అడవుల్లో వదులుతామని అటవీశాఖ అధికారులు సూచించారు. మన జాతీయ పక్షి అయిన నెమలికి హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

