రోడ్ టెర్రర్.. తాతా మనవళ్లను ఢీకొట్టి 2 కిలోమీటర్లు లాక్కెళ్లిన ట్రక్కు.. పాపం చూస్తుండగానే..
దేశ రాజధాని ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టిన కారు దాదాపు 20కిమీ ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టిన కారు దాదాపు 20కిమీ ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీ మహోబాలో స్కూటీపై వెళ్తున్న తాతామనవళ్లను ఓ ట్రక్ రెండు కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో 67 ఏళ్ల ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆరేళ్ల మనవడు సాత్విక్ దుర్మరణం పాలయ్యారు. స్కూటీపై ఉదిత్ నారయణ్ మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కాన్పుర్-సాగర్ హైవే ఎన్‌హెచ్ 8పై తాత చాన్‌సోరియా, మనవడు సాత్విక్ స్కూటీపై వెళ్తుండగా.. ట్రక్కు బలంగా ఢీకొంది. అనంతరం ట్రక్కు కాన్పూర్-సాగర్ నేషనల్ హైవేపై స్కూటీతో సహా సాత్విక్‌ను దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అనంతరం, ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకోవడానికి కొందరు ప్రయత్నించారు. అయినప్పటికీ లారీ డ్రైవర్ ఆగలేదు. చివరకు జనం బారికెడ్లు అడ్డుపెట్టి, ట్రక్కు మీద రాళ్లు విసరడంతో అతడు ఆపేశారు. ఇద్దరు ప్రాణాలను బలిగొన్న ట్రక్కు డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు.
కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో డ్రైవర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




