Andhra Pradesh: మోదీ-షాలతో ఏపీ కొత్త గవర్నర్ భేటీ.. ఢిల్లీలో ఫుల్ బిజీ షెడ్యూల్.. రేపు ఏపీకి తిరుగు ప్రయాణం..
AP Governor Abdul Nazir: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గవర్నర్, ఆదివారం మధ్యాహ్నం ప్రధాన మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. సాయంత్రం గం. 6.15 సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
శుక్రవారం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ ఆ వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టి రాజ్యాంగ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. సోమవారం సాయంత్రం ఆయన విజయవాడకు తిరుగుప్రయాణం కానున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
