AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Loan: మీకు ఆధార్‌ కార్డు ఉందా..? ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం!

Aadhaar Loan: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది. మీకు ఆధార్ ఉన్నట్లయితే మీరు బ్యాంకు నుంచి సులభంగా రుణం పొందవచ్చు. మీరు చిన్నపాటి వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఈ రుణాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ రుణం పొందాలంటే..

Aadhaar Loan: మీకు ఆధార్‌ కార్డు ఉందా..? ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం!
Aadhaar Card
Subhash Goud
|

Updated on: Feb 15, 2026 | 2:38 PM

Share

Aadhaar Loan: ఆధార్ కార్డు భారతీయ పౌరులకు చాలా ముఖ్యమైన పత్రం . పిల్లలను పాఠశాలలో చేర్పించడం నుండి వృద్ధాప్య ప్రయోజనాలను పొందడం వరకు, అనేక సేవలకు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. మీరు ఆధార్ కార్డును ఉపయోగించి రూ. 50,000 వరకు రుణం పొందవచ్చు. అది కూడా మీరు చిన్నపాటి వ్యాపారం స్టార్ట్‌ చేస్తున్నట్లయితే. ఈ రుణం పొందడానికి ఎవరు అర్హులు ? ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఆధార్ కార్డు ద్వారా రుణాలు

చిన్న వ్యాపారులకు రుణ సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పీఎం స్వానిధి (PM SWANidhi). కరోనా కాలంలో దుకాణాలు మూసివేసిన అనేక మంది చిన్న, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా చిన్న, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారులకు రూ. 50,000 రుణం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: RBI Currency: రూ.100, రూ.500 నోట్లు మారబోతున్నాయా..? ఆర్బీఐ ప్లాన్‌ ఏంటి?

మూడు విడతల్లో రుణం మంజూరు:

ఈ పథకంలో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా డబ్బులు ఇస్తారు. అంటే ఈ పథకంలో మొదటి విడతగా రూ.10,000 ఇస్తారు. ఏడాదిలోపు రుణం సరిగ్గా చెల్లిస్తే రెండో విడతలో రూ.20,000 అందిస్తారు. గడువులోపు డబ్బులు తిరిగి చెల్లిస్తే మూడో విడతలో రూ.50,000 వరకు రుణం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత కలిగిన వ్యాపారులు, లబ్ధిదారులు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులను సమర్పించడం ద్వారా బ్యాంకుల ద్వారా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రకమైన రుణం పొందడానికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేకపోవడం గమనార్హం. కానీ మీకు నియమ నిబంధనల ప్రకారం మాత్రమే రుణం అందిస్తారు.

ఇది కూడా చదవండి: Bajaj Pulsar: పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఆధార్‌ కార్డు ఉందా..?ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం
మీకు ఆధార్‌ కార్డు ఉందా..?ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం
నిమ్మకాయ తొక్కను పారేస్తున్నారా...? ఇది తెలిస్తే అస్సలు అలా చేయరు
నిమ్మకాయ తొక్కను పారేస్తున్నారా...? ఇది తెలిస్తే అస్సలు అలా చేయరు
రోడ్డు ప్రమాదంలో యువ బైక్ రేసర్ దుర్మరణం..!
రోడ్డు ప్రమాదంలో యువ బైక్ రేసర్ దుర్మరణం..!
పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే.. 350కి కిడ్నీల సమస్యలకు సంజీవని..!
పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే.. 350కి కిడ్నీల సమస్యలకు సంజీవని..!
చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. వాళ్ళు మీకు వెన్నుపోటు
చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. వాళ్ళు మీకు వెన్నుపోటు
పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!
పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!
IND vs PAK Live Score: భారత్, పాక్ హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధం
IND vs PAK Live Score: భారత్, పాక్ హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధం
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 115 ఏళ్ల నాటి రహస్యం.. డబ్బు మీ వెంట
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 115 ఏళ్ల నాటి రహస్యం.. డబ్బు మీ వెంట
ధురంధర్‏లో విలన్ ఛాన్స్ పై నాగార్జున కామెంట్స్..
ధురంధర్‏లో విలన్ ఛాన్స్ పై నాగార్జున కామెంట్స్..
ఆయనతో వీడియోలు చేసాక ఇంట్లోకి రానివ్వలేదు..
ఆయనతో వీడియోలు చేసాక ఇంట్లోకి రానివ్వలేదు..