AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: బంగారం ఉన్నవారికి శుభవార్త.. ఆర్బీఐ గోల్డ్ లోన్ నిబంధనలలో కీలక మార్పులు

Gold Loan: ఏదైనా అత్యవసరం కొన్ని నిమిషాల్లోనే రుణం కావాలంటే అది గోల్డ్‌ లోన్‌ అని చెప్పక తప్పదు. రుణం కావాలంటే బ్యాంకుల్లో గానీ, ఇతర ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో బంగారంపై త్వరగా రుణం లభిస్తుంది. పెద్దగా ప్రాసెస్‌ లేకుండా, ఎలాంటి పూచికత్తు, సిబిల్‌ స్కో్‌ర్‌ అవసరం లేకుండానే రుణం పొందవచ్చు. అయితే బంగారంపై రుణం తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్‌ తెలిపింది.

Gold Loan: బంగారం ఉన్నవారికి శుభవార్త.. ఆర్బీఐ గోల్డ్ లోన్ నిబంధనలలో కీలక మార్పులు
Gold Loan
Subhash Goud
|

Updated on: Feb 14, 2026 | 11:04 AM

Share

Gold Loan: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల బంగారు రుణాలకు సంబంధించి మూడు కీలకమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనలు బంగారం కలిగిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా బంగారు లోన్‌లను తీసుకోవాలని భావించే వారికి గొప్ప ప్రయోజనాలను అందించనున్నాయి. పాత పద్ధతులతో పోలిస్తే, ఈ కొత్త మార్పులు రుణగ్రహీతలకు ఆర్థికంగా మరింత వెసులుబాటును, భద్రతను కల్పిస్తాయి.

మొదటి ప్రధాన మార్పు లోన్ టు వ్యాల్యూ (LTV) నిష్పత్తికి సంబంధించింది. ఇదివరకు బ్యాంకులు బంగారు విలువలో 75% వరకు మాత్రమే రుణంగా ఇచ్చేవి. అయితే, కొత్త నిబంధనల ప్రకారం, LTV నిష్పత్తిని 75% నుండి 85%కి పెంచారు. దీని అర్థం, ఒక లక్ష రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే, మీరు ఇప్పుడు రూ.85,000 వరకు రుణం పొందవచ్చు. అయితే, ఈ 85% LTV నిష్పత్తి అన్ని రుణాలకు వర్తించదు. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మీరు రూ.2.5 లక్షల కంటే తక్కువ రుణం తీసుకుంటున్నట్లయితే 85% LTV వర్తిస్తుంది. ఒకవేళ రుణం రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య ఉంటే LTV నిష్పత్తి 80%గా ఉంటుంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే, LTV నిష్పత్తి పాత నిబంధనల ప్రకారం 75%గానే కొనసాగుతుంది. ఈ బహుళ శ్రేణి పద్ధతి వివిధ రుణగ్రహీతల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.

టాప్-అప్ లోన్‌:టాప్-అప్ లోన్‌:

రెండవ కీలక నిబంధన టాప్-అప్ లోన్‌ల మంజూరుకు సంబంధించింది. ఇకపై, ప్రతి బ్యాంకు గోల్డ్ లోన్‌లపై టాప్-అప్ లోన్‌లను తప్పనిసరిగా అందించాలి. టాప్-అప్ లోన్ అంటే, ఇప్పటికే మీరు తీసుకున్న బంగారు రుణానికి అదనంగా మరికొంత మొత్తాన్ని రుణంగా పొందడం. ఈ అదనపు రుణానికి కూడా మీరు గతంలో తాకట్టు పెట్టిన బంగారమే సెక్యూరిటీగా ఉంటుంది. ఇది రుణగ్రహీతలకు అదనపు నిధులు అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అయితే, ఈ టాప్-అప్ లోన్‌లను పొందడానికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. మంచి క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు ఈ టాప్-అప్ లోన్‌లను మంజూరు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

మూడవది గోల్డ్ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వడంలో జాప్యాన్ని నివారించడానికి RBI కఠినమైన నిబంధనను తీసుకొచ్చింది. లోన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత బ్యాంకులు 7 పని దినాలలోపు బంగారాన్ని రుణగ్రహీతలకు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంకు ఈ గడువులోగా బంగారాన్ని తిరిగి ఇవ్వడంలో విఫలమైతే, 7 రోజుల గడువు ముగిసిన తర్వాత ప్రతి రోజుకు రూ.5,000 పెనాల్టీగా రుణగ్రహీతకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు పది పని దినాల తర్వాత బంగారాన్ని తిరిగి ఇస్తే, అదనంగా జాప్యం చేసిన మూడు రోజుల (10-7=3)కు గాను బ్యాంకు రూ.15,000 (3 రోజులు x రూ.5,000) పెనాల్టీగా చెల్లించాలి. ఈ నిబంధన రుణగ్రహీతలకు భద్రతను, మనశ్శాంతిని అందిస్తుంది. బ్యాంకులకు బాధ్యతను పెంచుతుంది.

ఈ కొత్త నిబంధనలు బంగారం కలిగినవారికి, బంగారు రుణాల ద్వారా ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని చూసే వారికి ఎంతో ప్రయోజనకరంగా మారతాయి. అవి రుణగ్రహీతలకు ఎక్కువ లోన్ మొత్తాన్ని, అదనపు రుణ అవకాశాలను, అలాగే తమ బంగారం సురక్షితంగా, సకాలంలో తిరిగి వచ్చే భరోసాను కల్పిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి