AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikalahasti: మహాశివరాత్రి వేళ శివ భక్తులకు శుభవార్త.. శ్రీకాళహస్తి ఆలయంలో అవి ఫ్రీ..

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం సర్వాంగ సుందరంగా రూపొదిద్దుకుంది. పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అటు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లతో పాటు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు.

Srikalahasti: మహాశివరాత్రి వేళ శివ భక్తులకు శుభవార్త.. శ్రీకాళహస్తి ఆలయంలో అవి ఫ్రీ..
Srikalahasti
Venkatrao Lella
|

Updated on: Feb 15, 2026 | 8:08 AM

Share

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. శివక్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో ఎక్కబట్టినా శివనామస్మరణతో శివాలయాలు మారుమ్రోగిపోతున్నాయి. శివరాత్రి సందర్భగా శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు శివుడి సేవలో తరించిపోతున్నారు. ఇక దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 2 గంటల నుంచే దర్శనానికి భక్తులు పోటెత్తగా.. అధికారులు ప్రత్యేక క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు. సర్వదర్శనం చేసే భక్తులకు ప్రత్యేక లైన్, రూ.500 దర్శనం చేసుకునే భక్తులకు మరోక క్యూలైన్ ఏర్పాటు చేశారు.

భక్తులకు ఇవి ఉచితం

శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు ఉచితంగా మంచినీరుతో పాటు పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని ఆలయ అధికారులు నిర్ణయించింది. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్యూలైన్లలో ఉండే భక్తులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదిదాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఇవి జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇక ఇవాళ పండుగ రోజున రూ.50 ప్రత్యేక దర్శనం, రాహు కేతు పూజలు రద్దుచేశారు. భక్తులు ఈ విషయాన్ని తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

చిన్నారుల నృత్యాలు

బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల వరకు చిన్నారుల నృత్యాలు ఉంటాయి. భక్తులు స్వర్ణముఖి నది ఒడ్డున పుణ్యస్నాలు ఆచరించవచ్చు. ఇందుకు కూడా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటు శ్రీకాళహస్తి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరగా అలంకరించారు. దీంతో విద్యుత్ కాంతులతో ఆలయం భక్తులను ఆకర్షించనుంది. ఇక పుష్పాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ది పొందిన నర్సరాపుపేట సమీపంలోని కొటప్పకోండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకడిడి పెరిగింది. భారీగా విద్యుత్ ప్రభలు రెడీ అయ్యాయి.

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు
శివరాత్రి జాగరణ ఎందుకు..? ఎలా చేయాలో తెలుసా..?
శివరాత్రి జాగరణ ఎందుకు..? ఎలా చేయాలో తెలుసా..?
సూర్యకుమార్ వర్సెస్ పాకిస్థాన్..పాత లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం
సూర్యకుమార్ వర్సెస్ పాకిస్థాన్..పాత లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం
ప్రాణాలిచ్చే ఫ్యాన్స్.. ఊహించని స్టార్ డమ్..
ప్రాణాలిచ్చే ఫ్యాన్స్.. ఊహించని స్టార్ డమ్..
బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..
బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..
రైతు భరోసాపై మరో గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
రైతు భరోసాపై మరో గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా?
భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా?
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
మహాశివరాత్రి నాడు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే
మహాశివరాత్రి నాడు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే
పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తింటే..
పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తింటే..