Hardik Pandya vs Krunal Pandya : పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? హార్దిక్ అవుట్ అవ్వగానే కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్
Hardik Pandya vs Krunal Pandya : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ పలు ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. ముఖ్యంగా పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్ మధ్య ఉన్న విబేధాలు ఈ మ్యాచ్‌తో బహిర్గతమయ్యాయా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మైదానంలో వీరిద్దరి ప్రవర్తన చూసిన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

Hardik Pandya vs Krunal Pandya : చాలా కాలంగా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య సంబంధాలు సరిగ్గా లేవని పుకార్లు వస్తున్నాయి. ఆదివారం జరిగిన ముంబై-బెంగళూరు మ్యాచ్‌లో ఇవి నిజమేనని అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఇద్దరు సోదరులు ఒకరినొకరు కనీసం కళ్లలోకి కూడా చూసుకోలేదు. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్‌సీబీ తరపున ఫీల్డింగ్ చేస్తున్న కృనాల్ చాలా దూరం మెయింటైన్ చేశారు. వీరిద్దరి మధ్య గతంలో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఇసుమంతైనా కనిపించలేదు.
కృనాల్ ఆవేశపూరిత సెలబ్రేషన్స్
అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పుడు కెమెరాలు కృనాల్ వైపు మళ్లాయి. తన సొంత తమ్ముడు అవుట్ అయితే కృనాల్ చాలా దూకుడుగా సంబరాలు చేసుకున్నారు. గాలిలోకి ఎగురుతూ, ఆవేశంగా అరుస్తూ ఆయన చేసిన హంగామా చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడిగా వికెట్ పడితే సంతోషించడం సహజమే అయినా, ఒక సోదరుడిగా కృనాల్ ప్రవర్తన అస్వాభావికంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
🚨 SOMETHING WRONG BETWEEN HARDIK PANDYA & KRUNAL PANDYA 🚨
– For many days, reports had been suggesting that the relationship between Hardik Pandya and Krunal Pandya is not as good as before. Today on the field, it seemed to be proven. Hardik and Krunal didn’t even look at… pic.twitter.com/H079MQqjHp
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 12, 2026
కుటుంబ వివాదాలే కారణమా?
ఈ విబేధాల వెనుక పాత వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తమ సవతి సోదరుడు వైభవ్ పాండ్యాపై రూ.4 కోట్ల చీటింగ్ కేసు పెట్టినప్పుడు ఈ సోదరులిద్దరూ కలిసి ఉన్నారు. కానీ, హార్దిక్ తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. నటాషాతో కృనాల్ దంపతులు సన్నిహితంగా ఉండగా, హార్దిక్ మాత్రం మహీకా శర్మతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇటీవల హార్దిక్ ఐసీసీ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా కృనాల్ సోషల్ మీడియాలో కనీసం విష్ చేయకపోవడం అప్పట్లోనే హాట్ టాపిక్ అయ్యింది.
Hardik–Krunal Equation: Is Something Off? 👀
– Hardik Pandya and Krunal Pandya were always seen as very close – Post Hardik’s divorce from Natasa, things seem a bit different – Krunal and his wife were seen with Natasa (post divorce), while Hardik has been more with Mahika at… pic.twitter.com/sTfoXxyadt
— Vipin Tiwari (@Vipintiwari952) April 12, 2026
నెటిజన్ల రియాక్షన్
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ తన ప్రియురాలు మహీకాతో మాట్లాడుతున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ, హార్దిక్‌కు ఎప్పుడూ షో-ఆఫ్ చేయడమే ఇష్టమని విమర్శిస్తున్నారు. మరోవైపు అన్నాతమ్ముళ్ల మధ్య ఇలాంటి కోల్డ్ వార్ జరగడం టీమిండియాకు కూడా మంచిది కాదని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా వీరు ఏమీ చెప్పకపోయినా, మైదానంలో వారి మధ్య ఉన్న దూరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
