Chicken Prices: భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. నాన్‌వెజ్ తినేవారికి ఊరట.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?
నాన్‌వెజ్ తినేవారికి ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోాయాయి. గత నెలలో ఏకంగా రూ.350కి కిలో చికెన్ చేరుకుని వినియోగదారులకు షాకిచ్చింది. ఇప్పుడు ఒకేసారి రూ.150 మేర ధర తగ్గింది. దీంతో సామాన్యులపై ధరల భారం తగ్గింది.

నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు భారీగా తగ్గాయి. గత నెలలో ఏకంగా కిలో చికెన్ రూ.350 పలకగా.. పండుగ సీజన్ ముగిసిన తర్వాత దిగొస్తున్నాయి. దీంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. దీని ప్రభావంతో చాలామంది చికెన్ తినేందుకు భయపడుతున్నారు. ధరలు తగ్గడానికి ఇదొక కారణంగా తెలుస్తోంది. బర్డ్ ప్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. చికెన్ తినే నాన్ వెజ్ ప్రియులు మాత్రం కొంతమంది వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ ఆదివారం రావడంతో చికెన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఎక్కడచూసినా కస్టమర్లలో చికెన్ షాపులు కళకళలాడుతున్నాయి. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
రూ.150 మేర పడిపోయిన ధరలు
నెలరోజల వ్యవధిలోనే చికెన్ ధరలు ఆమాంతం తగ్గిపోయాయి. గత నెలలో సంక్రాంతి డిమాండ్ కారణంగా చికెన్ ధరలు రూ.350కి చేరుకున్నాయి. ఆ తర్వాత మేడారం జాతర రావడంతో ధరలు తగ్గలేదు. ఇప్పుడు బర్డ్ ప్లూ ఎఫెక్ట్‌తో పాటు పండుగ సీజన్ ముగియడంతో ధరలు భారీగా తగ్గాయి. చికెన్ ధర ఇప్పుడు రూ.150 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ డ్రస్స్‌డ్ చికెన్ ధర రూ.206 పలుకుతోంది. ఇక స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.234 పలుకుతుంది. గత నెలతో పోల్చుకుంటే ధరలు భారీగా తగ్గాయి. ఇక ఫాంరేటు రూ.115గా ఉండగా.. రిటైల్ ధర రూ.142గా కొనసాగుతోంది.
ఏపీలో ధరలు ఇలా..
ఇక ఏపీలో చికెన్ ధరల విషయానికొస్తే.. కిలో డ్రస్స్‌డ్ చికెన్ ధర రూ.206, స్కిన్‌లెస్ ధర రూ.234గా ఉంది. ఇక ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.115 పలుకుతుండగా.. రిటైర్ లైవ్ బర్డ్ ధర రూ.142 వద్ద కొనసాగుతోంది. ఇక ఎగ్ ధరలు కూడా పడిపోయాయి. గత నెలలో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.10 పలకగా.. ఇప్పుడు రూ.5కి పడిపోయింది. దాదాపు రూ.5 మేర గుడ్ల ధరలు తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించింది. ప్రస్తుతం 12 గుడ్ల ధర రూ.75గా మార్కెట్‌లో ఉంది. అటు ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో బర్డ్‌ప్లూ కలకలం రేపుతోంది. దీంత కిలో చికెన్ అక్కడ రూ.160 నుంచి రూ.180కు పడిపోయింది. 10 రోజుల క్రితం రూ.300గా ఉండగా.. ఇప్పుడు ఒకేసారి పతనమైంది. బర్డ్‌ప్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్‌ను 100 డిగ్రీలపైన టెంపరేచర్‌తో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
