AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన భర్త.. ఆ తర్వాత సీన్ చూస్తే..

ఒక స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్తకు తెలియకుండా ప్రియుడితో సరదాగా గడుపుతున్న సమయంలో జరిగిన డ్రామా ఇది. సదరు మహిళ తన ప్రియుడితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో, అనూహ్యంగా ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. భర్తను చూసి షాక్‌కు గురైన ఆ మహిళ, తన ప్రియుడిని కాపాడేందుకు ఒక వింత ప్లాన్ వేసింది.

స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన భర్త.. ఆ తర్వాత సీన్ చూస్తే..
Viral Couple Drama
Jyothi Gadda
|

Updated on: Apr 13, 2026 | 8:31 AM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. కొన్నిసార్లు నవ్వు తెప్పించేవి, మరికొన్నిసార్లు ఆశ్చర్యపరిచే వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఒక స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన సంఘటన నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, భర్తకు ద్రోహం చేసిన ఒక మహిళ, తన ప్రియుడితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడుపుతుండగా, సడెన్‌గా ఆమె భర్త అక్కడికి వచ్చాడు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో, ఆమె భర్త ఊహించని విధంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. భర్తను చూసిన వెంటనే ఆ మహిళకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే సమయస్ఫూర్తితో తన ప్రియుడిని నీటి లోపలికి వెళ్ళిపోమని సైగ చేసింది.

ప్రియుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటి అడుగుకు వెళ్లిపోయి నిశ్చలంగా ఉండిపోయాడు. సాధారణంగా ఎవరైనా నీటి అడుగున శ్వాస తీసుకోకుండా నిమిషం పాటు ఉండటమే కష్టం. కానీ, ఇక్కడ పట్టుబడితే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయంతో ఆ వ్యక్తి ఏకంగా రెండు నిమిషాల పాటు నీటి అడుగునే ఉండిపోయాడు. పైన ఆ మహిళ ఏమీ తెలియనట్లు తన భర్తతో మాటలు కలిపి, అతడిని అక్కడి నుండి పంపించేలా జాగ్రత్త పడింది. ఈ వీడియోను @NeverteIImeodd అనే యూజర్ Xలో పోస్ట్ చేశారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇతడు ఒలింపిక్స్‌లో ఉండాల్సిన వాడు, ఇక్కడ తప్పుడు చోట ఇరుక్కున్నాడు అని కొందరు జోకులు వేస్తుంటే.. భయం మనిషితో ఏదైనా చేయిస్తుంది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో నిజంగా జరిగిందా లేక సోషల్ మీడియా వ్యూస్ కోసం స్క్రిప్ట్ రాసి చిత్రీకరించారా అనేది స్పష్టంగా తెలియదు. ఏది ఏమైనా, నీటి అడుగున శ్వాస బిగబట్టి ఆ వ్యక్తి చేసిన ప్రయత్నం మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us