AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh: సినిమా స్టైల్ ప్రపోజల్.. న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్షదీప్ సింగ్

భారత స్టార్ క్రికెటర్, టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి, నటి సమ్రీన్ కౌర్‌తో కలిసి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Arshdeep Singh: సినిమా స్టైల్ ప్రపోజల్.. న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్షదీప్ సింగ్
Arshdeep Proposes To Samreen Kaur In New Zealand
Anand T
|

Updated on: Nov 11, 2026 | 8:16 PM

Share

భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి, నటి సమ్రీన్ కౌర్‌తో ఉన్న ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. బుధవారం నవంబర్ 11న న్యూజిలాండ్‌లో సమ్రీన్ కౌర్‌కు అర్షదీప్ ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.

ఈ సందర్భంగా సమ్రీన్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ భావోద్వేగ క్యాప్షన్ జోడించారు. జీవితం తమకు ఎన్నో ఇచ్చినప్పటికీ, ఒకరికొకరు దొరకడమే తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. జీవితాంతం కలిసే ఉంటామంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘11.11.2026’ తేదీని ప్రస్తావిస్తూ హాయ్ కాబోయే భర్తగారు అంటూ అర్షదీప్‌ను ఉద్దేశించి రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ జంట నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్షదీప్ సింగ్ అభిమానులతో పాటు సమ్రీన్ కౌర్ ఫాలోవర్లు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోస్ట్‌ ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Samreen (@samreenkaur__)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమ్రీన్ కౌర్‌తో స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ నిశ్చితార్థం
సమ్రీన్ కౌర్‌తో స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ నిశ్చితార్థం
చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన నాన్ వెజ్ డిషెస్ ఇవి..
చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన నాన్ వెజ్ డిషెస్ ఇవి..
చివరి ప్రయత్నం,ఎన్నో నిద్రలేని రాత్రులు..యూపీఎస్సీ అభ్యర్థి ఆవేదన
చివరి ప్రయత్నం,ఎన్నో నిద్రలేని రాత్రులు..యూపీఎస్సీ అభ్యర్థి ఆవేదన
కార్తీకమాసం స్పెషల్.. వేడి వేడి అన్నంలోకి కమ్మనైన కంద పచ్చడి
కార్తీకమాసం స్పెషల్.. వేడి వేడి అన్నంలోకి కమ్మనైన కంద పచ్చడి
సినిమాలో ఆ సీన్స్ లేవు తర్వాత రాసా..
సినిమాలో ఆ సీన్స్ లేవు తర్వాత రాసా..
మూడురోజుల పాటు ఎమ్మెల్యేలతో విజయ్ కీలక మీటింగ్
మూడురోజుల పాటు ఎమ్మెల్యేలతో విజయ్ కీలక మీటింగ్
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్‌ శ్రీముఖి.. వీడియో వైరల్
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్‌ శ్రీముఖి.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పాల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పాల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏది? రాయల సభలో తెనాలి చిక్కుముడి
ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏది? రాయల సభలో తెనాలి చిక్కుముడి
బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి..
బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి..