‘What Comes First, Day or Night?’ UPSC ఇంటర్వ్యూలో అభ్యర్థి సమాధానం వింటే నవ్వాల్సిందే!
UPSC ఇంటర్వ్యూలో అభ్యర్థుల తెలివితేటలు, సమయస్ఫూర్తిని పరీక్షించేందుకు కొన్నిసార్లు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటి ఓ సరదా ఇంటర్వ్యూ ప్రశ్న ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంటర్వ్యూయర్ పది సులభమైన ప్రశ్నలు అడగాలా? లేక ఒకే ఒక్క కఠినమైన ప్రశ్న అడగాలా? అని అభ్యర్థికి రెండు ఎంపికలు ఇచ్చారు. అభ్యర్థి రెండో ఎంపికను ఎంచుకోగా.. ‘ముందుగా వచ్చేది పగలా? రాత్రా?’ అని ప్రశ్నించారు. దీనికి అభ్యర్థి ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆ తర్వాత ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు అతను ఇచ్చిన తెలివైన కౌంటర్ ఏమిటి? తెలుసుకుందాం..

యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అంటే అభ్యర్థుల జ్ఞానాన్ని మాత్రమే కాకుండా వారి సమయస్ఫూర్తి, ఆలోచనా విధానం, తెలివితేటలను కూడా పరీక్షించే వేదిక. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు చాలా సులభంగా కనిపించినప్పటికీ, వాటి వెనుక ఆసక్తికరమైన మెలికలు ఉంటాయి. అలాంటి ఓ సరదా UPSC ఇంటర్వ్యూ ప్రశ్న, అభ్యర్థి ఇచ్చిన సమయస్ఫూర్తితో కూడిన సమాధానం ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది. ఓ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఇంటర్వ్యూయర్ రెండు ఎంపికలు ఇచ్చారు. అందులో పది సులభమైన ప్రశ్నలు లేదా ఒకే ఒక్క కఠినమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలని సూచించారు. అభ్యర్థి ఆలోచించి రెండో ఎంపికను ఎంచుకోవడం, ఆ తర్వాత జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.
ఇంటర్వ్యూయర్ ఇచ్చిన రెండు ఎంపికలు ఇవే!
ఇంటర్వ్యూ ప్రారంభమైన తర్వాత బోర్డులోని అధికారి అభ్యర్థితో ఇలా అన్నారు.
‘నేను మీకు పది సులభమైన ప్రశ్నలు అడగవచ్చు. లేదంటే ఒకే ఒక్క చాలా కష్టమైన ప్రశ్న అడుగుతాను. మీరు బాగా ఆలోచించి ఏది కావాలో నిర్ణయించుకోండి!’
దీంతో అభ్యర్థి కొద్దిసేపు ఆలోచించాడు. పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడమే మంచిదని భావించాడు. వెంటనే తనకు ఒకే ఒక్క కఠినమైన ప్రశ్న అడగాలని కోరాడు.
అభ్యర్థికి ఎదురైన అసలైన ప్రశ్న ఇదే!
అభ్యర్థి ఎంపికను అంగీకరించిన ఇంటర్వ్యూయర్.. ‘సరే, మీరు మీరే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఒకే ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పండి’ అన్నారు.
ఆ తర్వాత అడిగిన ప్రశ్న: ‘ముందుగా వచ్చేది పగలా? రాత్రా?’ (What comes first, Day or Night?)
ఈ ప్రశ్న వినగానే అభ్యర్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన సమాధానంపైనే ఇంటర్వ్యూలో విజయం ఆధారపడి ఉందని భావించాడు. కాసేపు ఆలోచించిన తర్వాత ఏమాత్రం తడబడకుండా..
‘పగలు ముందుగా వస్తుంది సార్!’ (It’s the DAY, Sir!)
అని సమాధానం ఇచ్చాడు.
మళ్లీ ప్రశ్నించిన ఇంటర్వ్యూయర్.. అభ్యర్థి కౌంటర్ అదుర్స్!
అభ్యర్థి సమాధానం విన్న ఇంటర్వ్యూయర్ వెంటనే మరో ప్రశ్న వేశారు.
‘ఎలా? పగలు ముందుగా వస్తుందని ఎందుకు చెబుతున్నారు?’ వివరణ ఇవ్వాలని కోరాడు. అప్పుడు అభ్యర్థి ఎంతో సమయస్ఫూర్తితో ఇలా సమాధానం ఇచ్చాడు. ‘క్షమించండి సార్.. మీరు నన్ను రెండో కఠినమైన ప్రశ్న అడగనని మాట ఇచ్చారు కదా!’ అంటూ చమత్కారంగా బదులిచ్చాడు. ఈ సమాధానంతో అభ్యర్థి తన తెలివితేటలను, ప్రశ్నలోని మెలికను ఎలా ఉపయోగించుకున్నాడో చూపించాడు. ఒక కఠినమైన ప్రశ్న మాత్రమే అడుగుతానని ఇంటర్వ్యూయర్ ముందే చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, రెండో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సరదాగా తప్పించుకున్నాడు.
ఈ సరదా ఇంటర్వ్యూ సంభాషణ ద్వారా ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకుని, ప్రశాంతంగా ఆలోచించి స్పందించడం ముఖ్యం. ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వం, నిర్ణయ సామర్థ్యం, సమయస్ఫూర్తి, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. మరి మీకే ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? పగలు ముందా? రాత్రి ముందా? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి!




