AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Chalisa: బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి వేడుకల్లో అరుదైన ఘట్టం!

Hanuman Chalisa In UK Parliament: బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. నవంబర్ 9న నిర్వహించిన దీపావళి వేడుకల్లో తబలా, హార్మోనియం వాయిద్యాల నడుమ భక్తులు హనుమాన్ చాలీసాను ఆలపించారు. ఈ అరుదైన ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hanuman Chalisa: బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి వేడుకల్లో అరుదైన ఘట్టం!
Hanuman Chalisa In Uk Parliament
Rajashekher G
|

Updated on: Nov 11, 2026 | 7:49 PM

Share

Hanuman Chalisa In UK Parliament: బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. నవంబర్ 9న లేబర్ ఏషియన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నవంబర్ 11న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిటన్‌లోని భారతీయ సంతతికి చెందిన ప్రజలతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, సామాజిక ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లోని చోల్మోండేలీ రూమ్ అండ్ టెర్రస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హియర్ అండ్ నౌ 365 వ్యవస్థాపకుడు మనీష్ తివారీ ఈ వేడుకలకు నాయకత్వం వహించగా.. లేబర్ ఏషియన్స్ సొసైటీ పోషకుడు లార్డ్ ఉదయ్ నాగరాజు ఆతిథ్యం ఇచ్చారు.

ఈ సందర్భంగా హనుమాన్ చాలీసాను తబలా, హార్మోనియం వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఆలపించారు. బ్రిటన్ పార్లమెంట్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో ఈ పఠనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యతను వివరిస్తూ మనీష్ తివారీ మాట్లాడుతూ.. దీపావళి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, వివిధ సమాజాల మధ్య ఐక్యతను చాటిచెప్పే వెలుగుల పండుగ అని పేర్కొన్నారు.

హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు దీపావళిని జరుపుకుంటారని, ప్రస్తుతం బ్రిటన్‌లో అన్ని నేపథ్యాలకు చెందిన ప్రజలు ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారని తెలిపారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పఠించడం తమ సమాజం ఎంతోకాలం గుర్తుంచుకునే ప్రత్యేక సందర్భమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను స్వాగతిస్తూ లార్డ్ ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఈ వేడుకలను నిర్వహించడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. లేబర్ ఏషియన్స్ సొసైటీ ప్రజాజీవనంలో కీలక పాత్ర పోషిస్తోందని, వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తోందని ప్రశంసించారు.

వీడియో చూడండి..

బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పఠనం జరగడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ వేదికపై లభిస్తున్న గుర్తింపునకు నిదర్శనంగా నిలిచింది.

Follow Us
బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి..
బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి..
మైనర్ బాలికతో చాటింగ్.. యువకుడిపై బాలిక తండ్రి, బంధువుల దాడి
మైనర్ బాలికతో చాటింగ్.. యువకుడిపై బాలిక తండ్రి, బంధువుల దాడి
ఆ పెద్ద నటుడు నన్ను అసభ్యకరంగా తాకాడు..
ఆ పెద్ద నటుడు నన్ను అసభ్యకరంగా తాకాడు..
ఇంట్లో వేప చెట్టు ఉంటే ఏమౌతుంది..? వాస్తు ప్రకారం ఆ దిశలో నాటితే
ఇంట్లో వేప చెట్టు ఉంటే ఏమౌతుంది..? వాస్తు ప్రకారం ఆ దిశలో నాటితే
ముచ్చింతల్‌లో వైభవంగా యతీంద్ర సప్తతి వేడుకలు.. చిన్న జీయర్ స్వామి
ముచ్చింతల్‌లో వైభవంగా యతీంద్ర సప్తతి వేడుకలు.. చిన్న జీయర్ స్వామి
వేడి అన్నంలోకి ఈ ఒక్క కూర ఉంటే చాలు.. పల్లెటూరి స్టైల్‌లో చేయండి
వేడి అన్నంలోకి ఈ ఒక్క కూర ఉంటే చాలు.. పల్లెటూరి స్టైల్‌లో చేయండి
కేరళ ఏనుగు పిల్ల 'మాయ'కు వంతారా ఊపిరి..
కేరళ ఏనుగు పిల్ల 'మాయ'కు వంతారా ఊపిరి..
ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి
ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి
వేసవిలో తాగు నీటి కష్టాలకు చెక్‌.. జలమండలి మాస్టర్ ప్లాన్ ఇదే!
వేసవిలో తాగు నీటి కష్టాలకు చెక్‌.. జలమండలి మాస్టర్ ప్లాన్ ఇదే!
చెప్పాపెట్టకుండా నా సీన్స్ తీసేసారు.. అందుకే సినిమా ఫ్లాప్
చెప్పాపెట్టకుండా నా సీన్స్ తీసేసారు.. అందుకే సినిమా ఫ్లాప్