AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు…ఊహించని ట్విస్ట్‌

కొన్నిసార్లు అనుకోకుండా జరిగే పొరపాట్లు జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి ఒక హృద్యమైన సంఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇద్దరు అమెరికన్ ప్రయాణికులు ఒక పండగలా, సంతోషంగా సాగిన అంత్యక్రియల కార్యక్రమాన్ని చూసి రెస్టారెంట్‌ అనుకుని పొరపాటుగా భావించారు. కానీ, ఈ అపార్థం తర్వాత జరిగినది మానవత్వానికి, ఆతిథ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సంఘటన ఎక్కడ, ఎలా జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే..

ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు...ఊహించని ట్విస్ట్‌
Tourists Mistakenly Enter Funeral in China
Jyothi Gadda
|

Updated on: Apr 13, 2026 | 9:55 AM

Share

సాధారణంగా దారి తప్పి ఎవరి ఇంటికైనా వెళ్తే ఏం జరుగుతుంది? మహా అయితే దారి చెబుతారు లేదా పంపించేస్తారు. కానీ చైనాలో ఇద్దరు పర్యాటకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఎదురైంది. పొరపాటున ఒక చావు ఇంటికి వెళ్ళిన వారికి రాజమర్యాదలు లభించాయి. ఈ సంఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షాయాంగ్ ప్రాంతంలో జరిగింది. లుడ్విగ్ అని పిలువబడే ఒక ప్రసిద్ధ అమెరికన్ యూట్యూబర్ అయిన లుడ్విగ్ ఆండర్స్ అహ్‌గ్రెన్ తన స్నేహితుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నాడు. ఇన్నర్ మంగోలియా చేరుకోవాలనే లక్ష్యంతో ఈ యాత్ర గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ప్రారంభమైంది. ఐదవ రోజున, వారు దారి తప్పి ఒక గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఒక ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్న జనాలను చూశారు. అక్కడ వినిపిస్తున్న సంగీతం, రంగురంగుల అలంకరణ చూసి అది ఏదో స్థానిక పండుగ లేదా పెళ్లి విందు అని భ్రమపడ్డారు. ఆకలితో ఉన్న వారు ఏమాత్రం సంకోచించకుండా లోపలికి వెళ్లారు. అలసిపోయి, ఆకలితో ఉన్న వారు చైనీస్ భాషలో మేము ఇక్కడ తినవచ్చా? అని అడిగారు.

లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే అది పెళ్లి కాదని, ఒక వృద్ధుడి అంత్యక్రియల వేడుక అని వారికి అర్థమైంది. తీవ్రమైన ఇబ్బందిగా (Awkward) ఫీల్ అయిన ఆ పర్యాటకులు వెంటనే క్షమాపణలు చెప్పి అక్కడ నుండి బయటపడాలని ప్రయత్నించారు. కానీ, అక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. మృతుడి బంధువులు ఆ పర్యాటకులను వెళ్ళనివ్వకుండా ఆపి, వారిని గౌరవంగా కూర్చోబెట్టారు. మా నాన్నగారు జీవించి ఉన్నప్పుడు అతిథులను గౌరవించడం ఆయనకు ఇష్టం. ఈ రోజు మీరు మా ఇంటికి రావడం ఆయన ఆత్మే పంపించిందని మేము భావిస్తున్నాము అని వారు పర్యాటకులతో చెప్పారు. వారికి అత్యంత ఖరీదైన చైనీస్ వంటకాలతో విందు వడ్డించడమే కాకుండా, వారి ప్రయాణం సుఖంగా సాగాలని ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

ఈ చైనీస్ సంప్రదాయంలో 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు జీవించిన వ్యక్తి మరణాన్ని దుఃఖంతో కాకుండా ఆనందంతో జరుపుకుంటారు. దీనిని సుదీర్ఘమైన, విజయవంతమైన జీవిత వేడుకగా భావిస్తారు. సాధారణ అంత్యక్రియలలా కాకుండా, ప్రజలు భోజనాలు, కార్యక్రమాల కోసం ఒకచోట చేరి దీనిని ఆనందంగా జరుపుకుంటారు. ఆ రోజు 104 ఏళ్ల వృద్ధుడి గౌరవార్థం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విషాద సమయంలో కూడా అపరిచితుల పట్ల ఆ కుటుంబం చూపిన మానవత్వం, ఆతిథ్యం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. సంస్కృతి, మర్యాద అనేది భాషకు, సందర్భానికి అతీతమైనది అని ఈ ఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us