40 సినిమాలు చేస్తే ఒక్క హిట్టు రాలేదు.. గ్లామర్‏తో ఫేమస్ ఈ హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

15 February 2026

దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది శ్రద్ధా దాస్.

తెలుగు, తమిళం భాషలలో దాదాపు 40 సినిమాల వరకు చేసింది. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీ సరైన బ్రేక్ అందుకోలేదు. గ్లామర్ ఫోటోలతో ఫేమస్. 

మెయిన్ హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్.

 ప్రతి రోజూ తన ఇన్ స్టా ఖాతాలో గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. తాజాగా మోడ్రన్ డ్రెస్సులలో అందమైన లుక్స్ షేర్ చేసింది.

దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అప్పుడప్పుడు అవకాశాలు అందుకుంటుంది. 

40 ఏళ్లకు చేరువలో ఉన్న ఈ వయ్యారి.. చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తుంది. నెట్టింట నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

2008లో 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది శ్రద్ధా దాస్.  ఆ తర్వాత వివిధ భాషల్లో దాదాపు 40 కి పైగా సినిమాలు చేసింది. 

ముంబైలో బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఈ అమ్మడు జర్నలిజం డిగ్రీ పూర్తి చేసింది. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.