ఉపవాసంలో ఖర్జూరం..ఎన్నో గంటలు కడుపు ఖాళీగా ఉన్న తర్వాత ఖర్జూరం తినడం వెనుక మతపరమైన ప్రాశస్త్యమే కాదు ఆరోగ్యపరమైన అంశాలూ ముడివడి ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతేకాదు ఖర్జూరాలలో కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి. వీటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా లభిస్తాయి. ఇది దీర్ఘ ఉపవాస కాలం తరువాత తక్షణమే శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తాయి.
నిజం చెప్పాలంటే ఖర్జూరాలు ఎనర్జీ డ్రింకులకంటే మెరుగ్గా పనిచేస్తాయి. పోషకాహార నిపుణులు సైతం ఉపవాసం తరువాత తక్షణమే తినాల్సిన ఆహారాలలో ఖర్జూరం ప్రధమం
సాధారణంగానే ఖర్జూర పండ్లలో నీటి శాతం ఎక్కువ. అన్ని గంటలపాటు నీరూ ఆహారమూ లేకుండా ఉండేవారు వీటిని తీసుకుని కాసిన్ని మంచినీళ్లు తాగితే శరీరం నెమ్మదిస్తుంది.
ఖర్జూరం పండ్లలో ఉండే సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒకేసారి పెరిగిపోకుండా చూస్తూనే శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.
వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు రక్తపోటును, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు, తగిన మోతాదులో చక్కెరలు, పీచులు, ఇతర పోషకాలు కలిగి ఉన్నాయి.
ఈ చక్కెరలు సులభంగా జీర్ణమవుతాయి కూడా. రోజంతా ఉపవాసం ఉన్నాక ఇవి తినడం వల్ల పొట్ట మీద ఒకేసారి భారం పడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు రక్తపోటును, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు, తగిన మోతాదులో చక్కెరలు, పీచులు, ఇతర పోషకాలు కలిగి ఉన్నాయి.