సరదాగా బీచ్‌లో తిరిగాడు.. రూ. 30 లక్షల బైక్‌పై హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాడు.. కట్ చేస్తే.!
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 25 లక్షల రూపాయల విలువ చేసే బిఎండబ్ల్యూ రేసింగ్ బైక్ ఈ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 30మంది బైక్ రేసర్లతో బయలుదేరిన బృందంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిట్యాల శివారులో జాతీయ రహదారి ప్రమాదంలో బైక్ రేసర్ ప్రాణాలు కోల్పోయాడు.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 25 లక్షల రూపాయల విలువ చేసే బిఎండబ్ల్యూ రేసింగ్ బైక్ ఈ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 30మంది బైక్ రేసర్లతో బయలుదేరిన బృందంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిట్యాల శివారులో జాతీయ రహదారి ప్రమాదంలో బైక్ రేసర్ ప్రాణాలు కోల్పోయాడు. 30 మంది యువకులు రైడింగ్ చేసుకుంటూ బాపట్ల బీచ్ కు వెళ్లారు. ఆదివారం (ఫిబ్రవరి 15) ఉదయం తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. అయితే చిట్యాల వద్ద అతివేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో రితిష్ రెడ్డి అనే యువకడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 25 లక్షల విలువ చేసే బిఎండబ్ల్యూ రేసింగ్ బైక్ పై రితిష్ రెడ్డి హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన యువకునిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బైక్ రేసింగ్‌లో ప్రావీణ్యం ఉన్న రితిష్ రెడ్డి, చిన్న పొరపాటుతో ప్రాణాలు కోల్పోయాడని, తోటి బైక్ రేసర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
