AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఆసుపత్రిలో రచ్చ.. చెప్పుల కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు!

చెప్పులే కదా తీసి పారేయలేము.. వాటికి చాలా విలువ ఉంది.. అందుకే ఆలయాలు, ఆసుపత్రులు, మరెక్కడైనా బయట చెప్పులు విడిచి వెళతాము.. ఎవరైనా ఎత్తుకు పోతారని కొందరు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇపుడు ఆ చెప్పుల వ్యవహారం ఇద్దరు మహిళలు మధ్య గొడవ జరిగి.. చివరికి కొట్టుకునే వరకు దారితీసింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో రచ్చ.. చెప్పుల కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు!
Women Fight In Hospital
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 16, 2026 | 9:31 PM

Share

చెప్పులే కదా తీసి పారేయలేము.. వాటికి చాలా విలువ ఉంది.. అందుకే ఆలయాలు, ఆసుపత్రులు, మరెక్కడైనా బయట చెప్పులు విడిచి వెళతాము.. ఎవరైనా ఎత్తుకు పోతారని కొందరు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇపుడు ఆ చెప్పుల వ్యవహారం ఇద్దరు మహిళలు మధ్య గొడవ జరిగి.. చివరికి కొట్టుకునే వరకు దారితీసింది.

సాధారణంగా ఆసుపత్రి అంటే రోగులు, వారి సహాయకులతో నిశ్శబ్దంగా ఉండాలి. కానీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రాణాలు కాపాడే చోట.. కేవలం చెప్పుల మీద నీళ్లు పడ్డాయన్న చిన్న కారణంతో ఇద్దరు మహిళలు వీధి పోరాటానికి దిగడం చర్చనీయాంశమైంది.

సత్తుపల్లి పట్టణంలో కొత్తగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పనులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అదే సమయంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం (MCH) వద్దకు వచ్చిన ఇద్దరు మహిళల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఒక మహిళ విడిచిన చెప్పుల మీద, మరో మహిళ పొరపాటున నీళ్లు పోయడమే ఈ గొడవకు ప్రధాన కారణం.

చెప్పులపై నీళ్లు ఎలా పోస్తావు అంటూ మొదలైన వాదన, క్షణాల్లోనే రణరంగంగా మారిపోయింది. ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆవేశంతో ఊగిపోయిన ఆ మహిళలు జుట్టు పట్టుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలోనే సినిమా సీన్ తరహాలో ఒకరినొకరు కింద పడేసి కొట్టుకుంటుంటే, అక్కడున్న రోగులు, వైద్య సిబ్బంది విస్తుపోయి చూశారు.

ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి వారిని విడదీసే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ మహిళలు ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. సెక్యూరిటీ కళ్ళెదుటే మళ్ళీ మళ్ళీ దాడులకు దిగారు. గొడవ ముదురుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మహిళలను సముదాయించి, కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించి వేశారు. ఆసుపత్రి వంటి పవిత్రమైన చోట ఇలాంటి చిన్న కారణాల కోసం గొడవ పడటం సరికాదని పోలీసులు మందలించారు. ఈ గొడవ మొత్తాన్ని అక్కడున్న కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఏదైనా, ఈ ఘటన సత్తుపల్లిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా