AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు

Medak Chain Snatching: మెదక్ జిల్లా రామ్ నగర్‌లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఓ వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారు గొలుసును దొంగ బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కాగా, విజువల్స్ వైరల్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
Medak Chain Snatching
P Shivteja
| Edited By: |

Updated on: Oct 05, 2026 | 3:51 PM

Share

మెదక్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చేసుకొని పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్ పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ఓ వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని దుండగుడు భారీ బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. రామ్ నగర్ నివాసి అయిన సదరు వృద్ధురాలు రోజువారీలాగే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో వీధి నిర్మానుష్యంగా ఉండటాన్ని గమనించిన ఒక గుర్తు తెలియని దుండగుడు బైక్‌పై ఆమెను వెనక నుంచి అనుసరించాడు. వృద్ధురాలికి ఏమాత్రం అనుమానం రాకుండా సమీపించిన ఆ వ్యక్తి, ఒక్కసారిగా ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసును బలంగా లాక్కున్నాడు. వృద్ధురాలు తేరుకునే లోపే, నిందితుడు తన బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన వృద్ధురాలు గట్టిగా కేకలు వేసినప్పటికీ, అప్పటికే దొంగ కళ్లెదుటే మాయమయ్యాడు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న ఒక ఇంటి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. దుండగుడు బైక్‌పై రావడం, ఒంటరిగా నడుస్తున్న వృద్ధురాలి మెడలోంచి చైన్ స్నాచింగ్ చేసి క్షణాల వ్యవధిలో పారిపోవడం వంటి దృశ్యాలు ఆ సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారుతున్నాయి. బాధిత వృద్ధురాలు జరిగిన ఘోరంపై కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా విజువల్స్‌ను స్వాధీనం చేసుకుని, బైక్ నెంబర్, నిందితుడి గుర్తింపు ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే నివాస ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో రామ్ నగర్ కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

వీడియో చూడండి..

Follow Us