బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!
బ్యాంక్ ప్రతినిధులమంటూ ఫోన్లు చేసి, అమాయక ప్రజల క్రెడిట్ కార్డులు, పిన్ నంబర్లు, ఓటీపీలు తెలుసుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక ప్రధాన సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ అంతర్రాష్ట్ర సైబర్ మోసాల వెనుక ఉన్న అసలు సూత్రధారి మహారాష్ట్రకు చెందిన చైతన్య ప్రమోద్ కుటె. పోలీసులు చెప్పిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్యాంక్ ప్రతినిధులమంటూ ఫోన్లు చేసి, అమాయక ప్రజల క్రెడిట్ కార్డులు, పిన్ నంబర్లు, ఓటీపీలు తెలుసుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక ప్రధాన సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ అంతర్రాష్ట్ర సైబర్ మోసాల వెనుక ఉన్న అసలు సూత్రధారి మహారాష్ట్రకు చెందిన చైతన్య ప్రమోద్ కుటె.
బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి.. క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకుని డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, వివిధ సిమ్ కార్డులు, టయోటా హైరైడర్ కారును స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణం బ్రాహ్మణవాడకు చెందిన ప్రఫుల్ పాటిల్‌కు జూలైలో బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేశాడు నిందితుడు చైతన్య ప్రమోద్ కుటె. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నమ్మించి.. ఓటీపీలు తెలుసుకుని ఐదు లావాదేవీల ద్వారా రూ.73,279 కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఆదిలాబాద్ పోలీసులు.. NCRP పోర్టల్‌లో లభించిన సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీ గుర్తించారు. మహారాష్ట్రకు వెళ్లిన ప్రత్యేక బృందం.. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్‌కు తీసుకొచ్చింది.
విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేసిన అనుభవాన్ని అడ్డుపెట్టుకున్న నిందితుడు.. కస్టమర్ల మొబైల్ నంబర్లను సేకరించి.. వివిధ సిమ్ కార్డులు, ఫోన్లతో బ్యాంక్ అధికారులుగా ఫోన్లు చేసేవాడని పోలీసులు తెలిపారు. క్రెడిట్ కార్డు, ఖాతా వివరాలతో పాటు ఓటీపీలను తెలుసుకుని.. డబ్బులను వివిధ UPI, అమెజాన్ ఖాతాలకు బదిలీ చేసేవాడని వెల్లడించారు.
తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో నిందితుడిపై దాదాపు 150 ఫిర్యాదులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు. ఈ కేసుల్లో బాదితులు సుమారు రూ.95.33 లక్షలు మోసపోయినట్లు గుర్తించారు. సైబర్ మోసానికి ఉపయోగించిన ఫోన్‌ను ధ్వంసం చేయడంతో పాటు.. సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు మార్చుతూ నిందితుడు మోసాలకు పాల్పడినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.




