AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచే సులభమైన చిట్కాలు!

పసుపు మన వంటింట్లో అత్యంత ముఖ్యమైన దినుసు మాత్రమే కాకుండా, అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మూలిక. మార్కెట్‌లో దొరికే పసుపులో కల్తీలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఇంట్లోనే కుండీలలో లేదా టెర్రస్ గార్డెన్‌లో స్వచ్ఛమైన ఆర్గానిక్ పసుపును పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరం. తక్కువ స్థలంలో, సులభమైన పద్ధతిలో పసుపు మొక్కను ఎలా పండించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచే సులభమైన చిట్కాలు!
How To Grow Turmeric At Home
Jyothi Gadda
|

Updated on: Oct 05, 2026 | 2:40 PM

Share

ఇంట్లోనే కుండీలలో లేదా గ్రో బ్యాగ్‌లలో పసుపు మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. మన వంటగదిలోని పసుపు కొమ్ములను ఉపయోగించే ఆర్గానిక్ పసుపును నాటుకోవచ్చు. దీని కోసం మంచి నీటి పారుదల సౌకర్యం ఉన్న 10-12 అంగుళాల లోతైన కుండీని ఎంచుకోవాలి. మొలకలు వచ్చిన పసుపు కొమ్ములను మట్టిలో రెండు అంగుళాల లోతులో నాటి, క్రమం తప్పకుండా నీరు పారించాలి. 7 నుండి 9 నెలల్లో పసుపు పంట చేతికి వస్తుంది. ఇంట్లోనే రసాయనాలు లేని స్వచ్ఛమైన పసుపును పొందడానికి ఇది అద్భుతమైన మార్గం.

సరైన కుండీ ఎంపిక:

పసుపు కొమ్ములు మట్టిలో లోపలికి వ్యాపిస్తాయి. కాబట్టి, కనీసం 10 నుండి 12 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీలు లేదా గ్రో బ్యాగ్‌లను ఎంచుకోవాలి. కుండీ అడుగుభాగంలో అదనపు నీరు బయటకు పోవడానికి ఖచ్చితంగా డ్రైనేజీ రంధ్రాలు ఉండాలి. పసుపు మొక్క లూజ్ గా, పోషకాలతో కూడిన మట్టిలో బాగా పెరుగుతుంది. దీని కోసం 40శాతం సాధారణ తోట మట్టి. 30శాతం వర్మీకంపోస్ట్ లేదా బాగా ఎండిన పశువుల ఎరువు. 30శాతం కొబ్బరి పొట్టు, కొద్దిగా ఇసుక కలిపి మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.

వంటగదిలో ఉండే పసుపు కొమ్ములలో మొలకలు వచ్చిన వాటిని ఎంచుకోవాలి. సిద్ధం చేసుకున్న కుండీ మట్టిలో 2 నుండి 3 అంగుళాల లోతులో ఈ కొమ్ములను మొలకలు పైకి ఉండేలా నాటాలి. అనంతరం తేలికగా నీరు చల్లాలి. పసుపు మొక్కకు రోజుకు కనీసం 4 నుండి 5 గంటల పాక్షిక సూర్యకాంతి అవసరం. మట్టి ఎల్లప్పుడూ తేమగా ఉండాలి. కానీ, కుండీలో నీరు నిల్వ ఉండకూడదు. నీరు ఎక్కువైతే కొమ్ములు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

పసుపు పంట సిద్ధమవ్వడానికి సుమారు 7 నుండి 9 నెలల సమయం పడుతుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం ప్రారంభించినప్పుడు పసుపు కొమ్ములు కోతకు సిద్ధమయ్యాయని గుర్తించాలి. అప్పుడు కుండీలోని మట్టిని మెల్లగా తొలగించి స్వచ్ఛమైన పసుపు కొమ్ములను సేకరించవచ్చు. ఈ చిన్నపాటి చిట్కాలతో ఎలాంటి రసాయనాలు లేని తాజా, ఆరోగ్యకరమైన పసుపును మీ ఇంట్లోనే పండించుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..