AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రీల్స్‌ క్రేజ్‌.. పచ్చని కాపురంలో చిచ్చు.. చివరికి ఊహించని విషాదం!

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి కాపురాల్లో చిచ్చుపెడుతోంది. రీల్స్ చేయవద్దని భర్త వారించడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆత్మహత్య చేసుకుంది. 11 ఏళ్ల బంధం, ఇద్దరు పిల్లలున్న కుటుంబం ఒక్క క్షణంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సోషల్ మీడియా వ్యసనం పచ్చని సంసారాలను ఎలా నాశనం చేస్తుందో ఈ ఘటన చాటిచెబుతోంది.

Telangana: రీల్స్‌ క్రేజ్‌.. పచ్చని కాపురంలో చిచ్చు.. చివరికి ఊహించని విషాదం!
Social Media Impact
P Shivteja
| Edited By: |

Updated on: Oct 05, 2026 | 6:04 PM

Share

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా క్రేజ్, రీల్స్ పిచ్చి కాపురాల్లో చిచ్చులు పెడుతోంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు పచ్చని సంసారాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేయవద్దని భర్త వారించినందుకు మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది.

11 ఏళ్ల బంధం.. ఇద్దరు పిల్లలు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు (మం) మామిడాల ఆర్‌అండ్‌ఆర్ (R&R) కాలనీకి చెందిన తేజస్విని (35) కి, జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్కోటిక్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం గజ్వేల్ పట్టణంలోని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీలో నివాసం ఉంటోంది. కొంతకాలం క్రితం తేజస్విని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అందులో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలుపెట్టింది.

కొంపముంచిన రీల్స్..! 

అయితే, భార్య ఇలా నిత్యం సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని భర్త గోపాల్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. రీల్స్ అప్‌లోడ్ చేయడం ఆపాలని భర్త గోపాల్‌రెడ్డి మందలించడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలోనే భర్త తనను రీల్స్ చేయవద్దని వారించడంతో తీవ్ర మనస్తాపానికి, తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన తేజస్విని బలవన్మర ణానికి పాల్పడింది.

ఉరివేసుకుని ఆత్మహత్య!

ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రీల్స్, సోషల్ మీడియా వ్యామోహం కారణంగా ఒకే ఒక్క క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల,ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆనందంగా ఉండాల్సిన కుటుంబంలో ఈ ఘటనతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..