Andhra News: ఇకపై ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకే.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 26) జీవో విడుదల..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 26) జీవో విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఒకటో తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
లాటరీ విధానంలో సీట్లను కేటాయిస్తారు. మొదటి రౌండ్‌లో ఎంపికై విద్యార్ధుల వివరాలు ఏప్రిల్ 13న వెల్లడిస్తారు. సెకండ్ రౌండ్ సెలక్షన్ లిస్టు ఏప్రిల్ 25న ప్రకటిస్తారు. మొత్తం 25 శాతం సీట్లలో అనాధలు, హెచ్‌ఐవీ బాధితులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, పేద ఓసీలకు 6 శాతం సీట్లను కేటాయించున్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఇతర వివరాలకు 14417 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.