IT Layoffs: రోబోలకూ తప్పని కష్టాలు.. ఉద్యోగం నుంచి తీసేసిన గూగుల్..!

రోబోలు ప్రతి రోజూ గూగుల్ కెఫెటేరియన్ టేబుళ్లను శుభ్రం చేస్తూ ఉంటాయి. రోబోలను అభివృద్ధి చేయడం, కెఫెటేరియన్లను..

IT Layoffs: రోబోలకూ తప్పని కష్టాలు.. ఉద్యోగం నుంచి తీసేసిన గూగుల్..!
Robot Cleaning Cafeteria
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 26, 2023 | 11:29 AM

ఐటీ కంపెనీలు అన్నీ కూడా తమ ఇష్టానుసారం ఉద్యోగులను తొలగిస్తున్న వేళ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 1200 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్.. తాజాగా ఆ కంపెనీలో సేవలందిస్తున్న రోబోలకు కూడా లేఆఫ్ ప్రకటించింది. ఈ రోబోలు ప్రతి రోజూ గూగుల్ కెఫెటేరియన్ టేబుళ్లను శుభ్రం చేస్తూ ఉంటాయి. రోబోలను అభివృద్ధి చేయడం, కెఫెటేరియన్లను శుభ్రం చేయడంలో శిక్షణ ఇచ్చే ఎక్స్‌పెరిమెంటల్ విభాగం ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టును ఆల్ఫాబెట్  మూసేసింది. ఇక ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగానే దీనిని మూసివేసినట్టు తెలుస్తోంది.

ఎవ్రీ డే రోబోట్స్ ప్రాజెక్టులో 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. మరోవైపు సుమారు 100 రోబోలు కెఫెటేరియాలోని చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయడం, తలుపులు తెరవడంతో పాటు ఇతర పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి. కరోనా సమయంలో ఇవి విశేష స్థాయిలో సేవలు అందించాయి. కాన్ఫరెన్స్ రూముల్లోని టేబుళ్ల పరిశుభ్రతను పరీక్షించేందుకు కూడా వీటిని ఉపయోగించేవారు. అయితే ఇప్పుడీ ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టు లాభదాయకం కాదని భావించిన ఆల్ఫాబెట్ దానిని మూసివేసింది.  ‘ఎవ్రీడే రోబోట్స్‌ ప్రాజెక్ట్‌ ఇక ఏమాత్రం అల్ఫాబెట్‌లో ప్రత్యేక ప్రాజెక్ట్‌గా ఉండబోదు’ అని గూగుల్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ డెనిస్‌ గంబోవా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం వినియోగించిన సాంకేతికతను, టీమ్‌ను గూగుల్‌ రీసెర్చిలో భాగంగా ఉన్న వేరే రోబోటిక్‌ ప్రాజెక్ట్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ఏడాది మొదట్లో 1200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.