Dream Science: ఇలాంటి కలల గురించి ఎవరికీ చెప్పకండి.. చెప్తే మీకే నష్టం.. ఎందుకంటే..?

కలలు రాబోయే కాలంలో జరగబోయే ఘటనల గురించి హెచ్చరించేవిగా ఉంటాయి. అలాంటి కలలను సూచనాత్మక కలలు అంటారు. ఒక వ్యక్తికి..

Dream Science: ఇలాంటి కలల గురించి ఎవరికీ చెప్పకండి.. చెప్తే మీకే నష్టం.. ఎందుకంటే..?
Dreams
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 26, 2023 | 9:26 AM

నిద్రపోతున్న సమయంలో కలలు కనడమనేది ప్రతి ఒక్కరి విషయంలో జరిగే సర్వసాధారణమైన విషయం. అయితే వీటిలో కొన్ని చెడ్డవిగా, వాటి వెనుక ఏదో తెలియని అర్థంతో కూడినవిగా ఉంటాయి. కలల శాస్త్రం లేదా స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కల వెనుక కూడా ఒక అర్థం దాగి ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో జరగబోయే ఘటనల గురించి హెచ్చరించేవిగా ఉంటాయి. అలాంటి కలలను సూచనాత్మక కలలు అంటారు. ఒక వ్యక్తికి మంచిని కలిగించే కలల గురించి ఇతరులకు ఎప్పుడూ చెప్పకూడదని స్వప్న శాస్త్ర గ్రంథాలల్లో ఉంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం మంచి కలలను, లేదా సంతోషాన్ని కలిగించే కలలను ఇతరులతో పంచుకోకూడదు. అలా చేస్తే ఆ కలలు ఎప్పటికీ నెరవేరవు. మరి ఏయే కలలను గోప్యంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సొంత మరణం: ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే, కలల సైన్స్ ప్రకారం అలాంటి కల శుభప్రదమైనది. ఈ కల గురించి ఎవరితోనూ పంచుకోనప్పుడు మాత్రమే దాని ప్రయోజనం చేకూరుతుంది. అలాంటి కల రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ కల గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరమవుతుంది.

భగవంతుని దర్శనం: ఒక వ్యక్తి కలలో దేవుడిని చూస్తే, ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని సంకేతం. ఇంకా ఉద్యోగానికి సంబంధించి ఏదైనా శుభవార్త అందుకోవచ్చు. ఇక అలాంటి కలలను రహస్యంగా ఉంచాలి.

ఇవి కూడా చదవండి

తాగు నీరు: ఒక వ్యక్తి కలలో తన తల్లితండ్రులను నీరు తాగటం చూస్తే, అది మంచి కలగా పరిగణించబడుతుంది. అలాంటి కలలను ఇతరులతో పంచుకోకూడదు. ఈ కలలు వ్యక్తి పురోగతికి సంబంధించినవి. వాటిని ఎవరితోనైనా పంచుకుంటే ప్రగతికి అవరోధంగా మారతాయి.

వెండి కలశం: కలలో వెండి కలశం కనిపించడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ కల నెరవేరుతుందని చెబుతారు. ఈ కల గురించి ఎవరికైనా చెబితే లక్ష్మి వెనుదిరుగుతుంది. అందువల్ల ఈ కలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోవద్దు.

మరిన్ని హ్యూమన్  ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..