SRH-IPL 2023: సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఫైర్..! కెప్టెన్సీ విషయంలో ఆ ఎంపిక సరికాదంటూ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఐడెన్ మార్క్రామ్ బదులుగా మయాంక్ అగర్వాల్ మెరుగైన కెప్టెన్సీ ఎంపిక అని నమ్ముతున్నారు. ఈ కర్ణాటక..
దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ టీమ్ కెప్టెన్‌గా నియమించింది. వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో భారత బ్యాట్స్‌మ్యాన్ మయాంక్ అగర్వాల్ అందరి కంటే ముందు ఉన్నాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ దక్షిణాఫ్రికా ఆటగాడు అయిన ఐడెన్ మార్క్రామ్‌పై విశ్వాసం ఉంచింది. రంజీ ట్రోఫీ 2023 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు కూడా దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌లో విజయం సాధించింది. అందుకే ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఐడెన్ మార్క్రామ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా నియమించింది.
అయితే ఈ నిర్ణయం ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏ మాత్రం కూడా దీనిపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేయడం లేదు. అంతేకాక సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఐడెన్ మార్క్రామ్ బదులుగా మయాంక్ అగర్వాల్ మెరుగైన కెప్టెన్సీ ఎంపిక అని నమ్ముతున్నారు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేసి ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram ?#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
డేవిడ్ వార్నర్, కెమ్ విలియమ్సన్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ మళ్లీ విదేశీ కెప్టెన్ పైనే నమ్మకం ఉంచిందని అభిమానులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్‌ను టీమ్ కెప్టెన్‌గా చేసిందని మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా పలువురు అభిమానులు ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విదేశీ కెప్టెన్లను ప్రేమిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని, ఐడెన్ మార్క్రామ్ స్థానం అతని కంటే తర్వాతే అని కూడా పేర్కొంటున్నారు.
Would have preferred Mayank but okay Markram was the second best choice anyways. https://t.co/6OVtv39wVV
— Sidheswar ? (@sidheswarcasm) February 23, 2023
అంతేకాక డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ టీమ్ కెప్టెన్ కావడానికి ముందు మూడు సీజన్ల పాటు జట్టులో ఆటగాళ్లుగా ఉన్నారని, అయితే ఐడెన్ మార్క్రామ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక్క సీజన్ తర్వాతనే కెప్టెన్‌గా మారాడని అభిమానులు అంటున్నారు.
Aiden Markram will lead Sunrisers Hyderabad in IPL 2023 then. Warner, Williamson, and now Markram – all overseas captains. Decision must have been greatly influenced by his SA20 performance, but I would have preferred Mayank Agarwal. #IPL2023
— Prasenjit Dey (@CricPrasen) February 23, 2023
మరోవైపు మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయలేదు. ఇది భారత ఆటగాడికి జరిగిన అన్యాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..